రాబోయే 22 రోజులు ఈ 5 రాశులకు అదృష్టమే.. వృత్తి, వ్యాపారాల్లో భారీ లాభాలు! మీ రాశి ఉందా?

Updated on: Nov 03, 2026 | 10:05 PM

Mercury Nakshatra Transit: నవంబర్ 3న బుధుడు చిత్ర నక్షత్రం నుంచి రాహువుకు చెందిన స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించాడు. నవంబర్ 25 వరకు ఇదే నక్షత్రంలో కొనసాగనున్నాడు. ఈ గ్రహ మార్పుతో మిథునం, కన్య, ధనుస్సు, మకరం, కుంభ రాశుల వారికి వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో తెలుసుకోండి.

1 / 6
Mercury Transit in Swati Nakshatra 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల సంచారంతో పాటు నక్షత్ర మార్పులకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా మేధస్సు, వ్యాపారం, విద్య, వాక్చాతుర్యానికి కారకుడిగా భావించే బుధ గ్రహం నక్షత్ర మార్పు వివిధ రాశులపై ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలోనే నవంబర్ 3న బుధుడు తన నక్షత్రాన్ని మార్చుకున్నాడు. ఉదయం 5:53 గంటలకు చిత్ర నక్షత్రం నుంచి రాహువుకు చెందిన స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించాడు. బుధుడు స్వాతి నక్షత్రంలో నవంబర్ 25 వరకు, అంటే దాదాపు 22 రోజుల పాటు కొనసాగనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి వృత్తి, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మిథునం, కన్య, ధనుస్సు, మకరం, కుంభ రాశుల వారికి ఈ నక్షత్ర సంచారం ప్రయోజనకరంగా ఉండవచ్చని అంచనా.

2 / 6
కన్య రాశి: కన్య రాశి వారికి పెట్టుబడుల ద్వారా ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ, వృత్తి రంగాల్లో కొత్త అవకాశాలు అందివస్తాయి. చాలాకాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందే సూచనలు కనిపిస్తున్నాయి.

3 / 6
కుంభ రాశి: బుధుడి నక్షత్ర మార్పు కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి అవకాశాలు లభించవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికంగా పురోగతి సాధించే సూచనలు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.

4 / 6
మకర రాశి: మకర రాశి వారికి అదృష్టం కలిసివచ్చే సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో పురోగతి సాధించవచ్చు. వ్యాపారంలో ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు కనిపించవచ్చు.

5 / 6
మిథున రాశి: ఈ రాశి వారికి బుధుడి సంచారం శుభప్రదంగా ఉండవచ్చు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ముందుకు వెళ్లేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఇది అనుకూల సమయం. కొత్త వ్యాపారం ప్రారంభించాలని భావించే వారికి పరిస్థితులు కలిసిరావచ్చు.

6 / 6
ధనుస్సు రాశి: బుధుడి నక్షత్ర మార్పు ధనుస్సు రాశి వారికి కూడా అనుకూల ఫలితాలను అందించవచ్చు. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో వృత్తి, వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడవచ్చు. (Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న ఫలితాలు జ్యోతిష్య నమ్మకాలు, సంప్రదాయాల ఆధారంగా అందించినవి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు.)

Loading...
Unable to load recommendations.
Follow Us