బుద్ధి కారకుడైన బుధ గ్రహం ఈనెల 25వ తేదీ నుంచి తన స్వక్షేత్రమైన మిధున రాశిలో సంచరించడం జరుగుతుంది. ఈ సంచారం జూలై 8 వరకు కొనసాగుతుంది. తెలివితేటలకు, వివేకానికి, దూర దృష్టికి, ప్రణాళిక బద్ధమైన జీవితానికి బుధ గ్రహం కారణం అవుతుంది. జాతకంలో బుధ గ్రహం బలంగా ఉన్న పక్షంలో ఆ జాతకుడి జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఎటువంటి సమస్యను అయినప్పటికీ సునాయాసంగా అధిగమించడం జరుగుతుంది. బుధ గ్రహం లగ్నంలో ఉన్నా, రాశిలో ఉన్నా అది దిగ్బలం ఇస్తుంది. దీనివల్ల ఆ వ్యక్తిలో తప్పకుండా జ్ఞానం విజ్ఞానం కలగలిపి ఉంటాయి. బుధ గ్రహానికి అధి దేవత వినాయకుడు. వినాయకుడిని శ్రద్ధగా పూజిస్తే బుధ గ్రహం అన్ని విధాలుగాను సానుకూలం అవుతుంది. మిధున రాశిలో ప్రవేశించిన బుధ గ్రహం వల్ల ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైన ఉపయోగం ఉంటుందో, యోగం పడుతుందో ఇక్కడ పరిశీలిద్దాం.