
మేషం: నాయకత్వ లక్షణాలు కలిగిన ఈ రాశివారికి రాశ్యధిపతి కుజుడు పంచమ స్థానంలోసంచారం చేయడం వల్ల తప్పకుండా అందలాలు ఎక్కే అవకాశాలు కలుగుతాయి. పోటీ పరీక్షలు, ఇంట ర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఏ రంగంలో ఉన్నా వీరికి అధికార యోగం పడుతుంది. ఆదాయం, ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కూడా పోటీదార్ల మీద పైచేయి సాధించి అగ్రస్థానంలో ఉంటారు. ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది.

కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారికి ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందడం, రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందడం, ఆస్తిపాస్తుల విలువ పెరగడం, ఆస్తులు సమకూరడం వంటివి జరుగు తాయి. సగటు వ్యక్తి కూడా సంపన్నుడయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. విదేశీ ఆఫర్ లభించే అవకాశం కూడా ఉంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి.

సింహం: అధికారం కోసం తపించిపోయే ఈ రాశివారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఈ రాశిలో సంచారం చేస్తున్న కుజుడు ఈ రాశివారికి ఉన్నత పదవులు అనుగ్రహిస్తాడు. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా విదేశాలకు తరచూ వెళ్లడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు దశమ స్థానంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశివారి ఉద్యోగ జీవితం ఒక వెలుగు వెలగడం ప్రారంభం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులులభిస్తాయి. ఒక సంస్థకు సర్వా ధికారి కావాలన్న వీరి ఆకాంక్ష నెరవేరుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ప్రభుత్వ ఉన్నతోద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. కొద్ది ప్రయత్నంతో సంపన్నులవుతారు.

ధనుస్సు: హద్దుల్లేని యాంబిషన్లు కలిగిన ఈ రాశివారు ఏ ప్రయత్నంలోనైనా సక్సెస్ అవుతారు. కుజుడు భాగ్య స్థానంలో ప్రవేశించి, రాశ్యధిపతి గురువుతో కలవడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా పట్టిం దల్లా బంగారం అవుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. పెళ్లి ప్రయ త్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమవుతుంది. పిత్రార్జితం, వారసత్వపు సంపద లభిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి లాభం, భూలాభం కలుగుతాయి.

మీనం: ఈ రాశికి షష్ట స్థానంలో, రాశ్యధిపతి గురువుతోకలిసి సంచారం చేయబోతున్న కుజుడి వల్ల ఈ రాశివారికి అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెంది సంపన్నులయ్యే అవకాశం ఉంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి, భూమి లభిస్తాయి. గృహ, వాహన యోగాలు కలుగు తాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్నకల నెరవేరుతుంది. ప్రభుత్వ ఉన్నతోద్యోగాలకు ఎంపి కయ్యే అవకాశం కూడా ఉంది. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.