
మేషం: ఈ రాశికి రాశ్యధిపతి కుజుడితో పాటు మూడు శుభ గ్రహాలు మరో మూడు నెలల వరకు బాగా అనుకూలంగా ఉంటున్నందువల్ల వారు ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నా, ఏ విధమైన కష్ట నష్టాల్లో ఉన్నా క్రమంగా బయటపడడం జరుగుతుంది. ఇతరుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందడం, మంచి అవకాశాలు లభించడం జరుగుతుంది. ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

వృషభం: ఈ రాశికి ధన స్థానంలో గురువు, భాగ్య స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు, లాభ స్థానంలో శని సంచారం వల్ల ఫిబ్రవరి, మే నెలల మధ్య వీరు కష్టనష్టాల నుంచి, సమస్యలు, ఒత్తిళ్ల నుంచి దాదాపు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. అనుకోకుండా కొన్ని మంచి ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. సొంత ఊర్లోనే మంచి ఉద్యోగంలోకి ప్రవేశించడానికి ఆఫర్లు అందుతాయి. వివాదాల్లో చిక్కుకుని ఉన్న ఆస్తికి సానుకూల పరిష్కారం లభించి కొంత ఊరట కలుగుతుంది.

సింహం: ఈ రాశికి లాభ స్థానంలో గురువు ఉండడం, శుక్ర, బుధుల అనుకూలం సంచారం వల్ల ఆదాయం క్రమంగా వృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. మే చివరి లోగా వీరు ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. ఆర్థిక, నిరుద్యోగ సమస్యలకు తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నా వీరు అతి సమీప భవిష్యత్తులో బాగా కోలుకుని, తమ కాళ్ల మీద తాము నిలబడడం జరుగుతుంది. వీరికి మంచి ఉద్యోగం లభిస్తుంది.

కన్య: ఈ రాశికి రాశ్యధిపతి బుధుడు, ధనాధిపతి శుక్రుడు మిత్ర క్షేత్రంలో బలంగా ఉండడంతో పాటు, దశమ స్థానంలో గురు సంచారం వల్ల ఫిబ్రవరి 13 నుంచి ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతుంది. సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మిత్రుల తోడ్పాటుతో జీవితంలో నిలదొక్కుకోవడానికి, తన కాళ్లపై తాను నిలబడడానికి అవకాశం లభిస్తుంది. పేదరికం, నిరుద్యోగం నుంచి బయటపడడానికి, వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశాలు లభిస్తాయి.

ధనుస్సు:ఈ రాశికి రాశ్యధిపతి గురువు సప్తమ స్థాన సంచారం వల్ల ఆదాయం బాగానే వృద్ధి చెందే అవకాశం ఉంది. ధన స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారి జీవితం అధ్వాన స్థితి నుంచి ఉచ్ఛస్థితికి ఎదగడం ప్రారంభం అవుతుంది. ఆశించిన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అనారోగ్యానికి తగ్గ వైద్య చికిత్స లభించి కోలుకునే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థికంగా బాగా నిలదొక్కుకుంటారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి.

కుంభం: ఈ రాశికి ఏలిన్నాటి శని జరుగుతున్నప్పటికీ, గురు దృష్టి వల్ల ఈ శని ప్రభావం బాగా తగ్గిపోవడంతో పాటు కొన్ని ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన దుస్థితి నుంచి క్రమంగా విముక్తి లభిస్తుంది. ఎక్కువగా స్వయం కృషితో ఆదాయాన్ని పెంచుకోవడం, ఆర్థిక సమస్యల్ని తగ్గించుకోవడం జరుగుతుంది. గ్రహ బలం వల్ల ఈ రాశివారు ఎంత ప్రయత్నిస్తే అంతగా లాభిస్తుంది. సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.