మహాపాపం.. మర్చిపోయి కూడా శివుడికి ఈ 5 వస్తువులు సమర్పించొద్దు..

Updated on: Feb 11, 2026 | 11:45 AM

శివుడికి ఇష్టమైన రోజు మహా శివరాత్రి. ఈ రోజు ఎవరు అయితే భక్తి, నిష్టతో శివారాధన చేస్తూ, శివుడిని పూజిస్తారో వారికి పరమేశ్వరుని ఆశీస్సులు లభించడమే కాకుండా, అనారోగ్య సమస్యలు కూడా తొలిగిపోతాయి అంటారు. అందుకే ఈ రోజు చాలా మంది ఉపవాస దీక్ష చేపట్టీ, జాగరం ఉంటూ, నిత్యం శివున్ని ఆరాధిస్తూ పూజలు చేస్తుంటారు. అయితే శివరాత్రి రోజు పూజ చేసే వారు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా ఐదు వస్తువులను శివలింగానికి అస్సలే సమర్పించకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
కేతకి పువ్వులు : కేతకి పువ్వులు శివ పూజకు పనికిరావు అంటారు. అందువలన మహా శివరాత్రి రోజున శివలింగానికి కేతకి పూలను సమర్పించకూడదు.  ఎందుకంటే?పురాణాల ప్రకారం,కేతకి పువ్వు బ్రహ్మదేవుడి అబద్ధం చెప్పుడు దానికి సాక్ష్యంగా నిలిచిందంట, అందువలన అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు పరమేశ్వరుడు శివ పూజలో కేతకి పూలు ఉండవు, వీటిని పూజకు వాడకూడదు అని శాపం పెడతాడంట.

2 / 5
తులసి ఆకులు : తులసికి హిందూ మతంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. తులసి లక్ష్మీ దేవి స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. కాని దీనిని శివ పూజకు ఉపయోగించకూడదు. తులసి విష్ణువుకు ప్రీతికరమైనది అందుకే శివ పూజలో దీనిని ఉపయోగించరు. అందువలన శివరాత్రి సమయంలో శివలింగానికి తులసి దళాలను సమర్పించకూడదు.

3 / 5
కుంకుమ : శాస్త్రాల ప్రాకారం, శివ లింగానికి కుంకుమ సమర్పించకూడదు. ఎందుకంటే? ఇది పార్వతీ దేవికి చాలా ప్రీతికరమైనది, ఆమెకు ఎప్పుడూ సమర్పించడం వలన దీనిని శివలింగానికి సమర్పించకూడదంట.

4 / 5
శంఖం నుండి నీటిని అందించడం : శివ రాత్రి రోజు శివలింగానికి శంఖాన్ని ఉపయోగించి నీటితో అభిషేకం చేయడం అశుభ కరం. శంఖం విష్ణువుతో ముడిపడి ఉంటుంది కాబట్టి, శివుడికి ఎప్పుడూ శంఖంతో నీటిని అందించకూడదంట.

5 / 5
బియ్యం గింజలు : గ్రంథాల ప్రకారం, శివలింగానికి విరగని బియ్యాన్ని మాత్రమే సమర్పించాలి. అలాగే పగలని బియ్యం గింజలు సమర్పించకూడదు.  ఇక అభిషేకం తర్వాత శివలింగానికి అక్షింతలు సమర్పించడం చాలా మంచిది.