
మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఏర్పడుతున్నందువల్ల అవమానాలకు, అపనిందలకు బాగా అవకాశం ఉంది. ప్రయాణాల్లో గానీ, ఇంట్లో గానీ విలువైన వస్తువులు కోల్పోవడం జరుగుతుంది. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆస్తి, గృహ ఒప్పందాల మీద సంతకాలు చేయడం వల్ల నష్టపోవడం లేదా మోసపోవడం జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఆశాభంగం కలిగిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉంది.

కర్కాటకం: రాశినాథుడైన చంద్రుడికి గ్రహణం పడుతున్నందువల్ల ఈ రాశివారు ప్రయాణాల్లోనూ, ప్రయత్నాల్లోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఉద్యోగంలో ప్రాభవం తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని సమస్యలు తలెత్తుతాయి. కొత్త ప్రయత్నాలేవీ తలపెట్టకపోవడం మంచిది. ఒప్పందాల మీద సంతకాలు చేయవద్దు. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది.

సింహం: ఈ రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడికి గ్రహణం పడుతున్నందువల్ల ఈ రాశివారి మీద అపనిందలు, ఆరోపణలు, విమర్శలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాభవం బాగా తగ్గుతుంది. బాధ్యతల నిర్వహణలో పొరపాట్లు జరిగే సూచనలున్నాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు తాత్కాలిక విరామం ప్రకటించడం మంచిది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు.

తుల: ఈ రాశికి పంచమ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల అపనిందలు, విమర్శలకు అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగంలో అధికారులు, బయట బంధుమిత్రుల వల్ల మాటలు పడే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. విధులు, బాధ్యతల నిర్వహణలో పొరపాట్లు జరిగే సూచనలున్నాయి. పిల్లల వల్ల కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో అనుకోకుండా మోసపోవడం జరుగుతుంది.

వృశ్చికం: ఈ రాశికి చతుర్థ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతులు ఆగిపోవడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా స్తబ్ధత ఏర్పడుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్ని ఆపడం మంచిది. ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. గృహ నిర్మాణ విషయాల్లో మోసపోవడం జరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి. వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల రహస్య శత్రువులు తయారవుతారు. ఉద్యోగంలో సహోద్యోగులు, వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు, కొందరు బంధుమిత్రుల వల్ల మోసపోవ డానికి అవకాశం ఉంది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఏమాత్రం ఇష్టం లేని ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు స్థాన చలన సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయ ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి.