
మిథునం: ఈ రాశికి రాశ్యధిపతి బుధుడు బలంగా ఉండడంతో పాటు ధన స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, శుక్రుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవు తుంది. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, మద్యం, షేర్లు, వడ్డీ వ్యాపారాలు వంటి రంగాల్లో ఉన్నవారు తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందడం జరుగుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. షేర్లు బాగా కలిసి వస్తాయి. వడ్డీ వ్యాపారాలు బాగా రాణిస్తాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.

కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం, తృతీయ, చతుర్థ స్థానాల్లో బుధ, శుక్రుల స్థితి వల్ల షేర్లు, వడ్డీ వ్యాపారాలు, కమిషన్ ఏజెన్సీల వల్ల అంచనాలను మించిన లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో జీత భత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో బాగా లాభాలు గడించడం వంటివి జరుగు తాయి. అనేక మార్గాల్లో ధనార్జన పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి లేదా తల్లి వైపు నుంచి సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆస్తిపాస్తుల మీద వచ్చే ఆదాయం కూడా పెరగవచ్చు.

కన్య: ఈ రాశికి ధన స్థానంలో శుక్రుడు, లాభస్థానంలో గురువు సంచారం జరుగుతున్నంత కాలం ఈ రాశివారికి తేలికగా, సునాయాసంగా ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో జీత భత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడించడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారు మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతారు.

తుల: రాశ్యధిపతి శుక్రుడు స్వస్థానంలో సంచారం చేయడం, ఈ నెల 26 తర్వాత భాగ్యాధిపతి బుధుడు కూడా ఇదే రాశిలోకి ప్రవేశించడం వల్ల తప్పకుండా ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగు తాయి. అప్రయత్నంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. ప్రముఖులతో లాభ దాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది.

ధనుస్సు: రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు లాభ స్థానంలో బుధ, శుక్రుల వరుస సంచారం వల్ల షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి డిమాండ్ పెరిగి అంచనాలను మించిన సంపాదన ఉంటుంది. జీవిత భాగస్వామి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది.

మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు దశమ స్థానంలో, గురువు సప్తమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేయడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగానే కాక, అదనపు ఆదాయ మార్గాల ద్వారా కూడా సంపాదన బాగా పెరిగే అవకాశం ఉంది. రాజకీయాలు, సినిమా, రియల్ ఎస్టేట్ రంగాలకు చెందినవారికి రాబడి బాగా వృద్ధి చెందుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. స్త్రీమూలక ధన ప్రాప్తి ఉంటుంది. ఆస్తిపాస్తుల విలువ అంచనాలకు మించి బాగా పెరుగుతుంది.