
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఈ కార్తీక మాసం మహారాజయోగం లాంటిది. శని ప్రభావంతో పాటు శివుడి అనుగ్రహం తోడు కావడంతో మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ఈ నెలలో పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, జీతం పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు, విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారు ఏ వ్యాపారం మొదలుపెట్టినా లాభాలే లాభాలు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. ముఖ్యంగా ఈ మాసం ధనస్సు రాశి వారికి అదృష్టాల పంట పండించనుంది.

వృషభ రాశి : వృషభ రాశి వారికి కార్తీక మాసం అద్భుతంగా కలిసి వస్తుంది. వీరికి ఈ మాసం మొత్తం చాలా కలిసి వచ్చే మాసంగా చెప్పాలి. శివుడి కృపతో మీ జాతకంలో ధనయోగం పట్టనుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. అప్పుల బాధల నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.

మకర రాశి :మకర రాశి వారికి కార్తీక మాసం విజయాలను తీసుకొస్తుంది. శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మీరు ప్రతి పనిలో విజయం పొందుతారు. ఎంత కష్టమైన పని అయినా సరే సులభంగా పూర్తి చేస్తారు. కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా వస్తాయి. ఉద్యోగపరంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుంది

తుల రాశి : తుల రాశి వారికి కార్తీక మాసం అన్ని విధాలా కలిసి రానుంది. శుక్ర బలం వలన మీ జీవితంలో లగ్జరీ పెరుగుతుంది. డబ్బుకు లోటు ఉండదు. చేపట్టే ప్రతి పనిలో విజయం, లాభం కలుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వెళ్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.