సింహ రాశిలోకి గురువు..ఆ రాశుల వారికి మహర్దశ! ఊహించని ధన యోగాలు

Edited By:

Updated on: Oct 14, 2026 | 4:07 PM

Jupiter Transit 2026: జ్యోతిషశాస్త్రం ప్రకారం ధనాధిపతి కన్నా ధనకారకుడైన గురువు అనుకూలత చాలా ముఖ్యం. గురువుకు స్వక్షేత్ర, మిత్ర క్షేత్ర, ఉచ్ఛ క్షేత్రాల్లో సంచారం ద్వారా బలం పట్టిందంటే ఆ జాతకులకు ఆదాయానికి లోటుండదు. ఈ నెల (అక్టోబర్) 31 నుంచి గురువు తనకు మిత్రక్షేత్రమైన సింహ రాశిలో ప్రవేశించి జనవరి 25 వరకు కొనసాగుతాడు. రవికి చెందిన సింహ రాశిలో ప్రవేశించిన తర్వాత గురువులో సాత్విక తత్వం, ఆధ్యాత్మిక ధోరణి మారిపోయి, అధికార దాహం, రాజసం, ధన దాహం బాగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల మేషం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులకు విపరీత రాజయోగాలు, ఊహించని ధన యోగాలు పట్టబోతున్నాయి.

1 / 6
మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో పెండింగ్ పనులన్నీ పూర్తి కావడం, ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడడం, వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి చెందడం, మనసులోని కోరికలు, ఆశయాలు చాలావరకు నెరవేరడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు ఊహించని స్థాయిలో మెరుగుపడతాయి. ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉన్నవారు ఉన్నత స్థితికి చేరుకుంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు బాగా వెల్లువెత్తుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి.

2 / 6
కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో గురు ప్రవేశం వల్ల ఆదాయ వృద్ధి ప్రయత్నాలు, ఆర్థిక వ్యవహారాలు విజ యాలతో సాగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత కష్టనష్టాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశముంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఏ రంగంలో ఉన్నవారికైనా అంచనాల్ని మించిన పురో గతి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. జీవితం పూర్తిగా మారిపోతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యసనాల నుంచి బయటపడతారు.

3 / 6
సింహం: ఇంతవరకూ వ్యయ స్థానంలో ఉన్న గురువు ఈ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశివారి జీవి తంలో అక్టోబర్ 31 నుంచి కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలోనూ, వృత్తి, వ్యాపారా ల్లోనూ ఊహించని పురోగతి ఉంటుంది. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా కలుగుతాయి.  ఉద్యో గావకాశాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా లభిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది.

4 / 6
తుల: ఈ రాశివారికి లాభ స్థానంలో గురువు సంచారం ప్రారంభిస్తున్నందువల్ల ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంటుంది. వారసత్వ సంపద లభిస్తుంది. పితృమూలక ధన లాభం ఉంటుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం పడుతుంది. తీర్థయాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మెరుగవుతుంది.

5 / 6
ధనుస్సు: రాశ్యధిపతి గురువు అష్టమ స్థానాన్ని వదిలిపెట్టి భాగ్య స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల జీవితంలో ఊహించని పురోగతితో పాటు, అనేక విధాలైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుద రడం లేదా ఉన్నతస్థాయి వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. ఆర్థిక పురోగతి ప్రారంభమై. ఆర్థిక సమస్యలు తగ్గడం జరుగుతుంది. సంతాన యోగం పడుతుంది. ఆరోగ్యం మెరుగ్గాఉంటుంది.

6 / 6
కుంభం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు సంచారం వల్ల మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరు తాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం గానీ, ప్రేమలో పడడం గానీ జరుగు తుంది. సంతాన యోగం కలుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. అనేక శుభవార్తలు వింటారు. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగ జీవితంలో కొన్ని కీలక శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us