
సాంప్రదాయ నమ్మకం: కొన్ని సంస్కృతులలో, ముఖ్యంగా హిందూవులు బంగారాన్ని లక్ష్మీదేవికి ప్రతీకగా చెబుతారు అందువల్ల నడుము క్రింద ధరించడం తగనిదిగా పరిగణించబడుతుంది. బంగారు పట్టిలు పాదాలపై ధరించడం లక్ష్మీని అగౌరవపరచినట్లు పరిగణించబడుతుంది.

పద్ధతులు: చాలా మంది హిందూ మహిళలు సాంప్రదాయకంగా బంగారు పట్టిలు లేదా కాలి ఉంగరాలు ధరించరు. అయితే కొన్ని సంస్కృతులలో వివాహిత స్త్రీలలో పెద్దవాళ్ళ విషయంలో మినహాయింపులు ఉండవచ్చు.

సంపద తగ్గుదల: జ్యోతిష్యం ప్రకారం.. కాళ్లకు బంగారు పట్టిలు లేదా కాలి ఉంగరాలు దర్శించడం అపచారం. ఇలా ధరించడం వల్ల సంపద నశిస్తుందని, వృత్తిలో పురోగతి లభించాదని అంటున్నారు పండితులు.

ప్రతికూల ప్రభావాలు: కాళ్లకు బంగారు నగలు ధరించడం ప్రతికూలతను సూచిస్తుందని పండితులు అంటున్నారు. బంగారు పట్టిలు ధరించం వల్ల దుష్ట శక్తులతో పీడించబడతారని చాలామంది హిందువుల నమ్మకం

ఆధునిక పద్ధతులు: కొంతమంది యువతులు ఫ్యాషన్, హుందాతనం కోసం కాళ్లకు బంగారు పట్టిలు ధరించినప్పటికీ సాంప్రదాయకంగా దినిని తప్పుగా భావిస్తున్నారు పండితులు. కాళ్లకు బంగారం ధరించడం అశుభమని అంటున్నారు.