
జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. వీటి కదలికలు, సంచారం, పన్నెండు రాశులను ప్రభావితం చేస్తాయి. ఇందులో కొన్ని రాశుల వారికి ఇవి అదృష్టాన్ని తీసుకొస్తే, కొన్ని రాశుల వారికి దురదృష్టాన్ని తీసుకొస్తాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉగాది తర్వాత కొన్ని గ్రహాల మార్పు వలన నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

మకర రాశి : మకర రాశి వారికి ఉగాది నుంచి లక్కు కలిసి వస్తుంది. ఈ రాశి వారు స్థిరాస్తి కొనుగోలుచేసే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారి కోరిక నెరవేరుతుంది. చాలా రోజుల నుంచి మంచి సంబంధం కోసం ఎదురు చూసే వారికి మ్యాచ్ ఫిక్స్ అయ్యి, త్వరలో వివాహం జరిగే ఛాన్స్ ఉంది. అన్ని విధాలా, ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి.

వృషభ రాశి : వృషభ రాశి వారికి ఉగాది నుంచి పట్టిందల్లా బంగారమే కానుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదరుచూసే వారికి ఈ సంవత్సరం జాబ్ గ్యారెంటీ, కానీ కష్టపడితేనే ప్రతి ఫలం పొందుతారు. అదే విధంగా ఆదాయం డబుల్ అవుతుంది. ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది.

మేష రాశి : మేష రాశి వారికి ఉగాది నుంచి అదృష్టం వరించనుంది. గ్రహాల కలయిక ఈ రాశి వారి జీవితంలో గొప్ప మార్పులు తీసుకొస్తుంది. అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా జీవిస్తారు. అన్ని విధాల ఇది మీకు మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి : ఉగాది నుంచి వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా లక్కు కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.