
జూలై 7 నుంచి ఆరు రాశులకు రెండు నెలల పాటు అయిదు గ్రహాలు అనుకూలంగా సంచారం చేస్తున్నాయి. ఈ అనుకూలత వల్ల ఈ రాశులవారికి పట్టపగ్గాలుండవు. గురు, శుక్ర, బుధ, రవి, కుజులతో పాటు ఇందులో కొన్ని రాశులకు శని, రాహువులు కూడా అనుకూలంగా మారబోతున్నాయి. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకరం, మీన రాశులకు కనీవినీ ఎరుగని ధన యోగాలు, రాజయోగాలు పట్టబోతున్నాయి. గజకేసరి, బుధాదిత్య, చంద్ర మంగళ యోగాల వంటి లక్ష్మీయోగాలు పట్టే అవకాశం కూడా ఉంది.

మేషం: ఈ రాశివారికి అయిదు గ్రహాల అనుకూలత వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరగడం, అనేక విధాలుగా ఆర్థిక పరిస్థితి ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగు తుంది. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఉద్యోగపరంగా ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రత్యేక గుర్తింపు లభించి అంచనాలకు మించిన రాబడి పొందే అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది.

వృషభం: రాశ్యధిపతి శుక్రుడితో సహా అయిదు గ్రహాలు అనుకూలంగా సంచారం చేయడం వల్ల ఈ రాశివారి జీవనశైలి సమూలంగా మారిపోయే అవకాశం ఉంటుంది. అనేక మార్గాల్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. గృహ, వాహన యోగాలకు అవకాశాలు కలుగుతాయి. ప్రముఖులతో, సంపన్ను లతో పరిచయాలు ఏర్పడతాయి. తీర్థయాత్రలకు, విహార యాత్రలకు వెళ్లడం జరుగుతుంది.

కర్కాటకం: ఈ రాశికి గురు, శుక్ర, రవి, కుజ, శనుల బలం పెరుగుతున్నందువల్ల మహాభాగ్య యోగం కలు గుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం అభివృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కలలో కూడా ఊహించని పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. వృత్తి, వ్యాపా రాలు విస్తరించే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సత్ఫలితా లనిస్తాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది.

కన్య: ఈ రాశికి దశమ, లాభ స్థానాల్లో అయిదు శుభ గ్రహాలు కలవడం, అందులో రాశ్యధిపతి బుధుడు కూడా ఉండడం విపరీత రాజయోగాన్ని కలుగజేస్తుంది. మనసులోని కోరికల్లో అధిక భాగం నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. జీతభత్యాలు వృద్ధి చెందుతాయి. వ్యాపా రాల్లో లాభాలపరంగా తిరుగుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుపోతాయి. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు, ఆదాయాలు బాగా కలిసి వస్తాయి.

మకరం: ఈ రాశికి శని, రాహు, గురు, బుధ, రవి గ్రహాలు అనుకూలంగా మారడం వల్ల జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంట్లో ఒకటి రెండు శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.

మీనం: ఈ రాశికి గురు, బుధ, కుజ, రవి, శుక్రుల అనుకూలత వల్ల కొద్ది ప్రయత్నంతో జీవితం మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాల్ని ఎక్కువ చేయడం మంచిది. కొత్త నిర్ణయాల్ని అమలు చేయడానికి ఇది అనుకూల సమయం. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ఆస్తివివాదం పరిష్కారమవుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. రావలసిన డబ్బు, బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతం అయ్యే అవకాశముంది.