
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారం, కదలికలు జరపడం కామన్. కొన్ని సార్లు గ్రహాల అరుదైన కలియక వలన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే ఫిబ్రవరి నెలలో చాలా గ్రహాలు సంచారం చేయనున్నాయి. ముఖ్యంగా 13వ తేదీన సూర్యుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే అదే రాశిలో బుధుడు సంచారంలో ఉన్నాడు, అంతే కాకుండా, ఫిబ్రవరి 23న కుజుడు కూడా ఇదే రాశిలోకి సంచారం చేయనున్నాడు.

ఇప్పటికే కుంభ రాశిలో రాహువు సంచారంలో ఉన్నాడు, అంతే కాకుండా, బుధుడు, సూర్యుడు కూడా అదే రాశిలో సంచారం చేస్తున్నారు. ఇలా కుంభ రాశిలో నాలుగు గ్రహాలు కలవడం వలన చతుర్గ్రహి రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన ఫిబ్రవరి చివరి వరకు మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

కుంభ రాశి : కుంభ రాశిలోనే నాలుగు గ్రహాల కలియక జరగడం వలన వీరికి అన్ని విధాల కలిసి వస్తుంది. ఏ కార్యం తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాల అద్భతంగా కలిసి వస్తుంది.

మిథున రాశి : మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే అని చెప్పాలి. వృత్తి ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. అనుకోని విధంగా లాభాలు అందుకుంటారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. పెట్టు బడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి చతుర్గృహి రారజయోగం వలన అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారు. అంతే కాకుండా ఈ రాశి వారు ఫిబ్రవరి చివరిలో గుడ్ న్యూస్ వినే ఛాన్స్ ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుటుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.