Hindu Temples: మనదేశంలో ఈ ఆలయాల్లో మహిళలకు మాత్రమే ప్రవేశం.. పురుషులకు నో ఎంట్రీ బోర్డు.. ఎందుకంటే..

|

Dec 21, 2023 | 1:52 PM

మన దేశంలోని కొన్ని ఆలయాల్లోకి పురుషులకు మాత్రమే ప్రవేశం ఉన్నట్లే.. కొన్ని ఆలయాల్లో స్త్రీలకు  మాత్రమే ప్రవేశం లేదా కొన్ని సమయాల్లో మహిళల కోసం మాత్రమే గుడి తలుపులు తెరుస్తారు. మన దేశంలో చాలా దేవాలయాలు లేదా ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో మహిళల ప్రవేశానికి అనుమతి లేదు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మహిళలు వినిపించిన నిరసన స్వరంతో హైకోర్టు కూడా మహిళలకు ప్రవేశ హక్కులను కల్పించాయి. హాజీ అలీ దర్గా, శని శింగనాపూర్, శబరిమల వంటి ప్రార్ధనా  స్థలాలు కొన్ని కారణాల వల్ల వార్తల్లో నిలిచాయి. అయితే భారతదేశంలో కొన్ని దేవాలయాల్లో పురుషుల ప్రవేశం నిషేధం. ఈ ఆలయాల్లో మగవారు అడుగు పెట్టడంపై ఆంక్షలున్నాయి. ఆ ఆలయాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.. 

1 / 6
కామాఖ్య దేవాలయం అస్సాంలోని గౌహతిలో ఉంది. నీలాచల్ కొండలపై నిర్మించబడింది. అన్ని శక్తి పీఠాలలో కామాఖ్య శక్తి పీఠానికి అత్యున్నత స్థానం ఉందని విశ్వాసం. అమ్మవారి ఋతుస్రావం రోజుల్లో ఇక్కడ పండుగను జరుపుకుంటారు. ఆ సమయంలో ఆలయంలో పురుషుల ప్రవేశం పూర్తిగా నిషేధించబడింది. అంతేకాదు ఈ సమయంలో కామాఖ్య దేవి పూజారి కూడా ఒక మహిళ. కామాఖ్య దేవి తన దగ్గరకు వచ్చే భక్తులందరి కోరికలను తీరుస్తుంది. భక్తులు తమ కోరికలను నెరవేర్చమంటూ ఇక్కడ అమ్మాయిలను పూజిస్తారు. జంతువులను బలి ఇస్తారు. భండారాను కూడా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఆడ జంతువులను బలి ఇవ్వరు. కామాఖ్య ఆలయ రహస్యాల్లో ఒకటి. కామాఖ్య దేవిని తాంత్రిక ఆరాధకులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. 

2 / 6
బ్రహ్మ దేవ ఆలయం రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఉంది. బ్రహ్మదేవుని ఆలయాన్ని భారతదేశం మొత్తంలో ఇక్కడ మాత్రమే చూడవచ్చు. ఈ ఆలయంలో పెళ్ళైన పురుషుల ప్రవేశం పూర్తిగా నిషేధం. ఈ ఆలయం 14వ శతాబ్దంలో నిర్మించబడింది. సరస్వతీ దేవి శాపం కారణంగా ఈ ఆలయంలోకి వివాహితుడు వెళ్లలేడని ప్రతీతి. అందువల్ల ఈ ఆలయాన్ని ప్రాంగణం నుంచి మాత్రమే పురుషులు దర్శించుకుంటారు. వివాహిత స్త్రీలు లోపలికి వెళ్లి పూజించవచ్చు.

3 / 6
భగవతీ దేవి ఆలయం కన్యాకుమారిలో ఉంది. ఈ ఆలయంలో పార్వతి అవతారమైన భగవతి మాత పూజలు అందుకుంటుంది. శివుడిని భర్తగా పొందాలని తపస్సు చేసేందుకు మహిళలు ఇక్కడికి వస్తారని చెబుతారు. భగవతి మాతను త్యజించే దేవత అని కూడా అంటారు. ఈ ఆలయంలో అమ్మవారిని సన్యసించిన పురుషులు మాత్రమే దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ ఆలయంలోకి పురుషులకు కూడా అనుమతి లేదు. ఈ ఆలయ సముదాయంలో కేవలం మహిళలు మాత్రమే పూజలు చేస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో స్త్రీలే కాకుండా హిజ్రాలకు కూడా పూజలు చేసుకునే స్వేచ్ఛ ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన మరొక విశేషమేమిటంటే, పురుషులు ఆలయంలోకి ప్రవేశించాలంటే స్త్రీల వలె అలంకరణలు చేయాలి.

4 / 6
మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న అట్టుకల్ భగవతి క్షేత్రం కేరళలోని 'తిరువనంతపురంలో ఉంది. పొంగల్ పండుగలో పాల్గొనేందుకు ఏకంగా 30 లక్షల మందికి పైగా మహిళలు ఇక్కడికి రావడంతో కేరళలోని ఈ ఆలయం పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది. ఈ ఆలయంలో ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ ఆలయంలో భద్రకాళిని ప్రత్యేకంగా పూజిస్తారు. పురుషుల ప్రవేశం నిషేధించబడిన ఈ ఆలయంలో భద్రకాళి మాత నివసిస్తుందని నమ్ముతారు.

5 / 6
చక్కులతుకవు దేవాలయం కేరళలో ప్రసిద్ధి దేవాలయాల్లో ఒకటి.  ఈ ఆలయంలో దుర్గామాత భక్తులతో పూజలను అందుకుంటుంది. ప్రతి సంవత్సరం పొంగల్ సందర్భంగా ఇక్కడ నారీ పూజ నిర్వహిస్తారు. ఇది 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ కాలంలో పురుషులు ఇక్కడికి రావడం పూర్తిగా నిషేధం. పూజ చివరి రోజు సందర్భంగా మగ పూజారులు మహిళల పాదాలు కడుగుతారు. పొంగల్ సందర్భంగా 15 రోజుల ముందుగానే ఈ ఆలయంలో మహిళల రద్దీ కనిపిస్తుంది. మహిళలు తమ వెంట బియ్యం, బెల్లం, కొబ్బరికాయలు తీసుకువస్తారు. దుర్గాదేవికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని మహిళల ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం ప్రస్తావన హిందూ పురాణాలలో కూడా ఉంది. 

6 / 6
బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఉన్న మాతా ఆలయంలో కూడా పురుషులకు కొన్ని సమయాల్లో ప్రవేశం నిషిద్ధం. ఈ ఆలయంలో నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. మాతకురుతుక్రమ సమయంలో పురుషులకు ప్రవేశం నిషేధం. ఈ సమయంలో మగ పూజారులకు కూడా ఆలయం వెలుపల నుంచి  మాత్రమే అనుమతి ఉంటుంది. కనీసం మగ పూజారికి ఆలయంలో ప్రవేశం నిషేధం.