
చావు పుట్టుకలు అనేవి సహజం. పుట్టిన ప్రతి వ్యక్తి మరణిస్తాడు. మరణించిన ప్రతి వ్యక్తి పుట్టక తప్పదు అంటారు. అయితే మరణం గురించి అనేక సందేహాలు ఒక వ్యక్తి మదిలో మెదులుతూ ఉంటాయి. ముఖ్యంగా చాలా మందికి మరణం తర్వాత ఆత్మ తనతో మాట్లాడుతుందా? అనే సందేహం ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

మరణం గురించి గరుడ పురాణంలో అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. అయితే చాలా వరకు ఆత్మ మరణం తర్వాత చాలా కుంగిపోతుంది, ఏడుస్తుంది, మన కుటుంబ సభ్యుల మధ్యే ఉంటుందని మన పెద్దవారు చెబుతుంటారు. అయితే చాలా మందిలో ఒక పెద్ద డౌట్ ఉంటుంది. అది ఏమిటంటే? అసలు ఆత్మ మనం మాట్లాడుకునే మాటలు వింటుందా? అని కాగా, ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం.

చాలా మంది మరణం తర్వాత ఆత్మ తన బంధువుల మాటలు వింటుంది అంటారు. అంతే కాకుండా గరుడ పురాణంలో మరణించిన వ్యక్తి ఆత్మ కొన్ని రోజుల పాటు తమ ఇంటి చుట్టే తిరుగుతుంది. అంతే కాకుండా వారి ప్రియమైన వారు ఏడుస్తే చూసి దుఃఖిస్తుంది అంటారు. అయితే అది ఇతరులు మాట్లాడుకునే మాటలు వింటుందా? అంటే అది చాలా వరకు వినలేదు అని చెబుతున్నారు పండితులు.

ఎందుకంటే. ఆత్మకు చాలా శక్తి ఉంటుంది. కానీ, దాని ఆత్మ శరీరం నుంచి పూర్తిగా వేరు చేయబడుతుంది. అప్పుడు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. మెదడు పని చేయడం ఆగిపోతుంది. అటువంటి సమయంలో ఆత్మ ఎలాంటి శబ్ధాలు వినలేదంట. నాడీ వ్యవస్థ పనితీరు మొత్తం ఆగిపోతుంది కాబట్టి , ఆత్మ ఎలాంటి శబ్ధాలు వినలేదు అని చెబుతున్నారు నిపుణులు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు