
దెయ్యాలు అంటే భయం ఎవరికి ఉండదు. చిన్నప్పటి నుంచి నాన్నమ్మలు, తాతయ్యలు దెయ్యాలకు సంబంధించిన అనేక స్టోరీలు చెబుతుంటారు. అందువలన చాలా మందికి ఇవి అంటే భయం ఉంటుంది. మరీ ముఖ్యంగా కుక్క విపరీతంగా మొరుగుతుంది అంటే చాలు చాలా మంది దానికి ఏదో ఆత్మ శక్తి కనిపించి అందుకే మొరుగుతుంది అని చెబుతుంటారు.

అంతే కాకుండా కొన్ని సార్లు కుక్కలు రాత్రి సమయంలో వింతైన శబ్దాలు చేస్తుంటాయి. అలా చేసిన కూడా వాటికి ఆత్మలు, శక్తులు వంటివి కనిపించడం వల్లనే అవి వింతగా ప్రవర్తించడం, వింతగా అరవడం చేస్తాయని చెబుతారు. అలాగే పిల్లు తదేకంగా ఒకే వైపు తీక్షణగా చూసినా కూడా ఆత్మ కనిపిస్తుందనే అలా చూస్తుంది అంటారు.

మరి నిజంగానే ఈ పిల్లికి, కుక్కలకు రాత్రి సమయంలో దెయ్యాలు కనిపిస్తాయా? అవి ఆత్మలు రాగానే పసిగట్టి వింత శబ్ధాలు చేస్తాయా? అసలు దీని గురించి పండితులు ఏం చెబుతున్నారు. రాత్రి సమయంలో పిల్లి, కుక్క వింతగా ప్రవర్తించడం, వింతగా అరవడం వెనక ఉన్న కారణాలు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

కుక్కలు, పిల్లులు రాత్రి సమయంలో కాస్త వింతగా ప్రవర్తిస్తుంటాయి. ముఖ్యంగా దేనినో చూసినట్లు అరవడం , పారిపోవడం వంటివి చేస్తుంటాయి. దీంతో చాలా మంది వాటికి ఆత్మలు కనిపించాయని చెప్పుకొస్తుంటారు. అయితే మనుషుల కంటే జంతువులకు వినికిడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుందంట. అందువలన అవి దూరం నుంచి వచ్చే చిన్న శబ్ధాలను కూడా కనిపెట్టి, వింతగా ప్రవర్తించడం చేయడం, అదే దిశలో మొరగడం చేస్తాయంట.

మరీ ముఖ్యంగా పిల్లి ప్రవర్తన రాత్రి సమయంలో చాలా వింతగా అనిపిస్తుంది. దానిని తీక్షణంగా గమనిస్తే ఎవ్వరైనా భయపడాల్సిందే, ఇక దాని ఏడుపు వింటే నిజంగానే ఏదో ఆత్మ వచ్చింది అనుకోక తప్పదు అలా ఉంటుంది. అయితే పిల్లి దూకడం, ఏడవడం, తీక్షణంగా చూడటానికి కారణం అవి చీకటిలో నీడను గమనిస్తాయంట. ముఖ్యంగా కీటకం, నీడలను చూసి వింతగా ప్రవర్తిస్తుంది. అనారోగ్య సమస్యలకు గురి అయినప్పుడు మాత్రం అరుస్తుందంట. కుక్కలు, పిల్లులు దెయ్యాలను చూడగలవని చెప్పడానికి ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి రాత్రిపూట జంతువులు వింతగా ప్రవర్తిస్తుంటే, అవి దెయ్యాన్ని చూశాయని అర్థం కాదు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ , నిపుణుల ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని గమనించాలి.