Astrology: ధనుర్మాసంలో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..! ధన, అధికార యోగాలు

Edited By: Janardhan Veluru

Updated on: Dec 08, 2025 | 3:12 PM

ఈ నెల(డిసెంబర్) 16న రవి గ్రహం ధనూ రాశిలో ప్రవేశించడంతో ఈ ఏడాది ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ ధనుర్మాసం జనవరి 14 వరకూ కొనసాగుతుంది. మహా విష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైన ఈ ధనుర్మాసంలో కొన్ని రాశుల వారి మీద లక్ష్మీదేవి తన కటాక్ష వీక్షణాలను ప్రసరించబోతోంది. మేషం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి తప్పకుండా ధన యోగాలు, అధికార యోగాలు, ఇతర శుభ యోగాలు కలిగే అవకాశం ఉంది. ఈ రాశుల వారు ఒక నెల రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం విష్ణు సహస్ర నామ స్తోత్రం పఠించడం వల్ల తప్పకుండా వారి మనసులోని కోరికలు, ఆశలు నెరవేరడం జరుగుతుంది.

1 / 6
మేషం: ఈ రాశికి భాగ్య స్థానంలో రవి సంచారం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. విదేశీ సంపాదన అనుభవించే యోగం కలుగుతుంది. ఆదాయం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించే ఆశించిన విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిత్రార్జితం లభిస్తుంది.

2 / 6
సింహం: రాశ్యధిపతి రవి తనకు మిత్రక్షేత్రమైన ధనూ రాశిలో ప్రవేశించడం వల్ల రాజపూజ్యాలు ఎక్కువగా కలుగుతాయి. ఉద్యోగంలో హోదా, ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువగా లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందు తాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు పెరుగుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.

3 / 6
వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతి అయిన రవి ధన స్థానంలో సంచరించడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి.  ఆదాయ వృద్ధికి అవకాశాలు బాగా పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రయాణాల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన రవి ఇదే రాశిలో ప్రవేశించడం వల్ల ధనుర్మాసమంతా ధన ధాన్య సమృద్ధి యోగం పట్టే అవకాశం ఉంది. దేనికీ లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకటికి రెండు సార్లు ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. ప్రతి ఆదాయ వృద్ధి ప్రయత్నమూ రెట్టింపు ఫలితాలనిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సంతాన భాగ్యం కలుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. పిత్రార్జితం లభిస్తుంది.

5 / 6
కుంభం: సప్తమాధిపతి రవి లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది.  ఉద్యోగులకు కూడా నిరుద్యోగులతో పాటు విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇంట్లో ఆశించిన శుభ కార్యాలు జరుగుతాయి. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. రాజపూజ్యాలు ఎక్కువగా కలుగుతాయి.

6 / 6
మీనం: ఈ రాశికి దశమ స్థానంలో రవి సంచారం వల్ల ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. సంపన్న కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.