
హిందూ మతంలో ధనత్రయోదశి పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు లక్ష్మీదేవిని పూజించడం వలన జీవితంలోని ప్రతికూలతలు తొలిగిపోయి, ఇంటిలో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది అంటారు. అంతే కాకుండా ఈరోజు నుంచే దీపావళి పండుగ కూడా ప్రారంభం అవుతుంది. ఈ రోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని ,కుబేరుడిని, గణేశుడిని పూజిస్తుంటారు. దీని వలన సంపదకు లోటు ఉండదు అని చెబుతుంటారు. అంతే కాకుండా ఈ రోజున ధన్వంతరి దేవుడిని కూడా పూజిస్తుంటారు.

ఇక 2026లో నవంబర్ 7న ధన త్రయోదశి వచ్చేస్తుంది. నవంబర్ 6 ఉదయం 10.30 గంటలకు పండుగ తిథి ప్రారంభం కాగా, నవంబర్ 7 ఉదయం 10.47 గంటలకు ముగుస్తుంది. అయితే చాలా వరకు ధన త్రయోదశిని ఉదయం తిథి ఆధారంగా జరుపుకుంటారు. అందువలన నవంబర్ 7న ధన త్రయోదశి పండుగను ప్రజలు అందరూ కూడా ఘనంగా జరుపుకుంటారు.

అయితే ఈ ధన త్రయోదశి రోజున చీరుపురు, కొత్తిమీర గింజలు కొనుగోలు చేయడం చాలా మంచిది అని చెబుతుంటారు. దీని వలన ఆర్థికంగా ఆరోగ్య పరంగా ఇలా అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. ఇంటిలో సానుకూల శక్తి పెరుగుతుందంట.

అంతే కాకుండా ధన త్రయోదశి రోజున, 13 దీపాలను వెలిగించడం కూడా చాలా మంచిదంట. ముఖ్యంగా సూర్యస్తమయం అయిన తర్వాత ఇంటి ముందు 13 దీపాలు వెలిగించడం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. శ్రేయస్సు నెలకొంటుంది, సంపద కూడా పెరుగుతుందంట.

అంతే కాకుండా అత్యంత పవిత్రమైన ధన త్రయోదశి రోజున శఖంలో గంగ నీరు నింపి ఇంటిలో మొత్తం చల్లడం వలన ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలిగిపోతాయంట. చాలా రోజుల నుంచి పూర్తి కాని పనులు కూడా పూర్తి అవుతాయి. వ్యాపార పరంగా కూడా కలిసి వస్తుందంట. అలాగే ఈ రోజు దానధర్మాలు చేసినా కలిసి వస్తుందంట