
మేషం: ఈ రాశికి అయిదు గ్రహాల అనుకూలత వల్ల జీవితం సానుకూల మలుపులు తిరిగే అవకాశం ఉంది. కలలో కూడా ఊహించని శుభవార్తలు వింటారు. వ్యక్తిగత, కుటుంబ, ఉద్యోగ జీవితాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా పెరిగి, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. పెళ్లి, గృహ ప్రవే శాలు, శంకుస్థాపనల వంటి శుభ కార్యాలు జరుగుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు.

మిథునం: ఈ రాశికి ఈ మూడు శుభ గ్రహాలతో పాటు రవి, కుజుల అనుకూల సంచారం వల్ల జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగు తుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెంది, ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు ఊపందు కుంటాయి. పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరుగుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది.

కర్కాటకం: ఈ రాశికి ఆరు గ్రహాలు బాగా అనుకూలంగా మారినందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. కొన్ని ముఖ్యమైన కష్టనష్టాల నుంచి, సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపతారు. గృహ ప్రయ త్నాలు సానుకూలపడతాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. రాదనుకుని వది లేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. పెండింగులో ఉన్న శుభ కార్యాలు జరిగే అవ కాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ఆశించిన శుభవార్తలు వింటారు.

తుల: ఈ రాశికి రాహుకేతువులతో సహా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఊహించని రాజ యోగాలు, ధన యోగాలు కలుగుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమవుతుంది.

ధనుస్సు: ఈ రాశికి ఒక్క శని తప్ప మిగిలిన గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందు వల్ల ఉద్యోగ జీవితంలో ఊహించని శీఘ్ర పురోగతి సాధ్యమవుతుంది. వృత్తి జీవితం కూడా కొత్త పుంతలు తొక్కుతుంది. ఇంటా బయటా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో యాక్టివిటీ వృద్ధి చెందు తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు వంటివి కనక వర్షం కురిపిస్తాయి. ఉన్నత స్థాయి పరిచయాలు కలు గుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తేలికగా నెరవేరుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

కుంభం: ఏలిన్నాటి శని మినహా గ్రహపరంగా ఎటువంటి దోషమూ లేనందువల్ల ఈ రాశివారికి జీవితం నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడం జరుగుతుంది. కుటుం బంలో శుభకార్యాలు జరుగుతాయి. రావలసిన డబ్బు, మొండి బాకీలు చేతికి అందుతాయి. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి.