ఆరు రాశులకు ధన సమృద్ధి యోగం.. ఆర్థికంగా అనూహ్యంగా అదృష్టం పట్టనుంది.. !

| Edited By: Janardhan Veluru

Sep 14, 2023 | 7:18 PM

Chandra Mangala Yoga: ఈ నెల 15, 16, 17 తేదీలలో కన్యారాశిలో చంద్ర మంగళ యోగం ఏర్పడుతోంది. చంద్ర మంగళ యోగాన్ని జ్యోతిష శాస్త్రంలో ధన సమృద్ధి యోగం అని కూడా వ్యవహరిస్తారు. ప్రధానంగా ఈ యోగం లక్ష్యం ఆదాయం పెరగడం, అప్పులు తగ్గడం. ఈ యోగం పట్టినప్పుడు ఆర్థిక సమస్య లన్నీ బాగా తగ్గుముఖం పట్టడమే కాకుండా, బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం కూడా జరుగుతుంది.

1 / 7
ఈ నెల 15, 16, 17 తేదీలలో కన్యారాశిలో చంద్ర మంగళ యోగం ఏర్పడుతోంది. చంద్ర మంగళ యోగాన్ని జ్యోతిష శాస్త్రంలో ధన సమృద్ధి యోగం అని కూడా వ్యవహరిస్తారు. ప్రధానంగా ఈ యోగం లక్ష్యం ఆదాయం పెరగడం, అప్పులు తగ్గడం. ఈ యోగం పట్టినప్పుడు ఆర్థిక సమస్య లన్నీ బాగా తగ్గుముఖం పట్టడమే కాకుండా, బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం కూడా జరుగుతుంది. కన్యా రాశిలో గత కొద్ది కాలంగా సంచరిస్తున్న కుజ గ్రహంతో చంద్రుడు కలవడం వల్ల ఈ యోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల ఆరు రాశులకు లాభం కలగబోతోంది. అవిః వృషభం, మిథునం, సింహం, వృశ్చికం, మకరం, మీనం.

2 / 7
వృషభం: ఈ రాశివారికి పంచమ స్థానంలో ఈ చంద్ర మంగళ యోగం ఏర్పడుతున్నందువల్ల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసివస్తుంది. ఆర్థిక లావాదేవీలు, జూదాలు, లాటరీ, స్పెక్యులేషన్ వంటివి బాగా లబ్ధి చేకూరుస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లాభా లకు లోటుండదు. కుటుంబపరంగా సంపద పెరుగుతుంది. జీవిత భాగస్వామి ఆదాయంలో కూడా మెరుగుదల ఉంటుంది. రుణ సమస్యలు తగ్గిపోవడమే కాకుండా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.

3 / 7
మిథునం: నాలుగవ స్థానంలో ఏర్పడిన చంద్ర మంగళ యోగం వల్ల గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి. తల్లి వైపు నుంచి గానీ, భార్య వైపు నుంచి గానీ ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. స్త్రీ మూలక ధన లాభం కూడా ఉంది. ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరగడం, వృత్తి,
వ్యాపారాల్లో అనూహ్యంగా రాబడి పెరగడం వంటివి జరుగుతాయి.

మిథునం: నాలుగవ స్థానంలో ఏర్పడిన చంద్ర మంగళ యోగం వల్ల గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి. తల్లి వైపు నుంచి గానీ, భార్య వైపు నుంచి గానీ ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. స్త్రీ మూలక ధన లాభం కూడా ఉంది. ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో అనూహ్యంగా రాబడి పెరగడం వంటివి జరుగుతాయి.

4 / 7
సింహం: ఈ రాశికి ధన స్థానంలో పడుతున్నచంద్ర మంగళ యోగం వల్ల తప్పకుండా ఆర్థికపరమైన అదృష్టం పడుతుంది. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వారు, డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల్లో ఉన్నవారు ఆర్థికంగా బాగా ప్రయోజనం పొందుతారు. పిత్రార్జితంగా వచ్చిన ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. స్థలాలు, ఇళ్ల విలువ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా కొద్దో గొప్పో తప్పకుండా ఆదాయం పెరగడం జరుగుతుంది.

5 / 7
వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో ధన సమృద్ధి యోగం అనే చంద్ర మంగళ యోగం ఏర్పడినందువల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. రావలసిన డబ్బు, రాదనుకుని వదిలేసుకున్న డబ్బు, మొండి బాకీలు వగైరాలన్నీ గరిష్టంగా వసూలు అవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా ఆదాయం, రాబడి పెరిగే సూచనలున్నాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ప్రయ త్నాలన్నీ పూర్తిగా సానుకూలపడతాయి. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి.

6 / 7
మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఈ ధన యోగం ఏర్పడుతున్నందువల్ల ఆర్థికంగా అనూహ్యంగా అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. పిత్రార్జితం కలిసి వస్తుంది. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. పెండింగులో ఉన్న ఆర్థిక సంబంధమైన పనులు పూర్తయిపోతాయి. రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ వారికి, ఆర్థిక నిపుణులకు, బ్యాంకర్లకు బాగా కలిసి వస్తుంది.

7 / 7
మీనం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో ఈ యోగం పట్టడం వల్ల వృత్తి, వ్యాపారాలపరంగా బాగా కలిసి రావడం ప్రారంభం అవుతుంది. ఆర్థికంగా ఏ పని తలపెట్టినా విజయం సాధించడం జరుగుతుంది. ఆస్తి సంబంధమైన వివాదాలు పరిష్కారం అయి, ఒప్పందాలు
కుదర్చుకోవడం జరుగుతుంది. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. భూ సంబంధమైన క్రయ విక్రయాల్లో అంచ నాలకు మించిన లాభాలు అందుతాయి. వ్యాపార భాగస్వాముల ద్వారా కూడా అదృష్టం పడుతుంది.

మీనం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో ఈ యోగం పట్టడం వల్ల వృత్తి, వ్యాపారాలపరంగా బాగా కలిసి రావడం ప్రారంభం అవుతుంది. ఆర్థికంగా ఏ పని తలపెట్టినా విజయం సాధించడం జరుగుతుంది. ఆస్తి సంబంధమైన వివాదాలు పరిష్కారం అయి, ఒప్పందాలు కుదర్చుకోవడం జరుగుతుంది. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. భూ సంబంధమైన క్రయ విక్రయాల్లో అంచ నాలకు మించిన లాభాలు అందుతాయి. వ్యాపార భాగస్వాముల ద్వారా కూడా అదృష్టం పడుతుంది.