చంద్రగ్రహణం.. గర్భిణీలు గ్రహణం రాత్రి తప్పక చేయాల్సిన పని ఇదే!

Updated on: Feb 28, 2026 | 12:15 PM

చంద్ర గ్రహణం వచ్చేస్తోంది. 2026లో మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇక హోలీ పండుగ రోజే చంద్ర గ్రహణం ఏర్పడటం వలన ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ సమయంలో గర్భిణీలు జాగ్రత్తలు తీసుకుంటూ తప్పకుండా కొన్ని పనులు చేయాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
హోలీ రోజే చంద్రగ్రహణం కాబట్టి, ఈ రోజున పండుగ జరుపుకోకూడదని చెబుతున్నారు పండితులు. ఇక ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం రోజు ప్రతికూల శక్తుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంట. అందువలన చిన్న పిల్లల నుంచి గర్భిణీల వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

2 / 5
ఈ రోజు గర్భిణీలు ఇంటి నుంచి బయటకు రాకూడదంట. వీలైనంత వరకు పడుకొని ఉండటమే చాలా మంచిది. ముఖ్యంగా వీరు గ్రహణం సమయంలో ఆహారం తీసుకోకూడదంట. ఇది అనేక సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు పండితులు. అదేవిధంగా ఈ రోజు చాలా ప్రశాంతంగా కోపం లేకుండా, శాంతి స్వభావంతో ఉండాలంట.

3 / 5
అదే విధంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో గ్రహణ ప్రభావం బిడ్డపై పడకుండా ఉండటానికి, గర్భిణీలు రాత్రి సమయంలో తమ కడుపు పై కుంకుమ పువ్వు పూసుకోవాలని చెబుతున్నారు పండితులు. ఎందుకంటే? ఇది పిండాన్ని రక్షిస్తుందంట. దీని వలన ఎలాంటి ప్రభావం పిండంపై పడకుండా ఉంటుంది.

4 / 5
గర్భిణీలు గ్రహణ సమయంలో పదునైన వస్తువులను ఉపయోగించడం అస్సలే మంచిది కాదు. ముఖ్యంగా కూరగాయలు కట్ చేయడం, ఫ్రూట్స్ కట్ చేసుకొని తినడం వంటి పనులు అస్సలే చేయకూడదంట. అదే విధంగా బయట నిల్చొని గ్రహణాన్ని చూడటం కూడా అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు.

5 / 5
చంద్ర గ్రహణం సమయంలో గర్భిణీలు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ, ఓం నమ: శివాయా లేదా, గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఉండాలంట. దీని వలన పిండంపై ఎలాంటి ప్రతికూల శక్తులు ప్రభావం ఉండదంట. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us