Chanakya Niti: ఈ ప్రదేశాల్లో బస చేయడం అత్యంత ప్రమాదకరం.. ఒక్క క్షణం కూడా ఉండొద్దన్న చాణక్య

|

Jun 27, 2023 | 1:17 PM

ఆచార్య చాణక్యుడు తాను రాసిన చాణక్య నీతి శాస్త్ర పుస్తకంలో జ్ఞానవంతుడు, తెలివైన వ్యక్తి ఎటువంటి  పరిస్థితి ఎదురైనా దృఢంగా ఎదుర్కోవాలని చెప్పాడు. అయితే కొన్ని అసాధారణ పరిస్థితులు ఎదురైతే.. వాటిని మార్చడం అసాధ్యం అయితే.. అక్కడితో మీ జర్నీ ఆపేసే బదులు మార్గాన్ని అన్వేషించాలని పేర్కొన్నాడు. 

1 / 5
దేశంపై దాడి: మన దేశం లేదా ఒక ప్రాంతంపై మరొక ప్రాంతం దాడి చేస్తే అటువంటి పరిస్థితిని ఎదుర్కోవడం అసాధ్యం అయితే.. అక్కడి నుండి పారిపోవడమే మంచిదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.  ఇలాంటి దాడులతో స్థానికుల జీవితం నరకప్రాయంగా మారుతుంది. తిండి, పానియాలకు కొరత ఏర్పడి.. ఇబ్బంది పడతారు. ఒకొక్కసారి ఒకరిపై ఒకరు యుద్ధానికి కూడా దిగే పరిస్థితి కూడా నెలకొంటుంది.

2 / 5
కరువు పరిస్థితి: ఏదైనా ప్రాంతంలో లేదా రాష్ట్రంలో కరువు ఉంటే అక్కడ నివసించడంలో అర్థం లేదని చాణక్య నీతి చెబుతుంది. అలాంటి ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడం మంచిది. కరువు పీడిత ప్రాంతంలో నివసించడం వల్ల కుటుంబ జీవితం ప్రమాదంలో పడుతుంది.

3 / 5
సంపదను ప్రదర్శించండి: ఆచార్య చాణక్యుడు తన విధానాలలో ఒక వ్యక్తి తన సంపదను ఎప్పుడూ ప్రదర్శించకూడదని నొక్కి చెప్పాడు. మీ దగ్గర ఉన్న డబ్బు గురించి గోప్యత పాటించాలని ఎవరితోనూ  పంచుకోకూడదని పేర్కొన్నాడు. ఇలా చేయడం వల్ల మీ డబ్బుపై ఇతరుల చెడు దృష్టి  పడే అవకాశం ఉంది. 

4 / 5
శత్రువు దాడి: శత్రువు ఎవరికైనా ఇబ్బంది కరమే అని.. అతను ఎప్పుడైనా మీ పై దాడి చేయవచ్చు అని చెప్పాడు ఆచార్య చాణక్యుడు. అలా హఠాత్తుగా శత్రుడు మీ పై దాడి చేస్తే.. ఎదుర్కోవడానికి మీ వద్ద ఎటువంటి వ్యూహం ఉండదు. కనుక అటువంటి శత్రువుపై ప్రతీకారం తీర్చుకోకండి.. వెంటనే ఆ స్థలాన్ని  విడిచి పెట్టమని సూచించాడు చాణక్య. 

5 / 5
సహనం,  క్షమాపణ: ఒక వ్యక్తి ఎల్లప్పుడూ సహనంతో ఉండాలని..  క్షమించే గుణం కలిగి ఉండాలని చాణక్యుడు చెప్పాడు. ఏదైనా పొరపాటు జరిగితే దానిని ఎప్పుడూ గుర్తు పెట్టుకుని ఎత్తి చూపకుండా.. అందుకు బదులు క్షమించి ముందుకు సాగాలి. సమస్యలను పరస్పరం మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి.