స్త్రీ సమాజ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని.. సమాజాన్ని నిర్మించగలదని.. అదే సమయంలో నాశనం చేయగలదని చెప్పాడు. మహిళకు విద్య చాలా అవసరం.. చదువుకున్న మహిళలు తన కుటుంబాన్ని, సమాజాన్ని మంచి స్థాయిలో నిలుపుతారు. కనుక స్త్రీలకు చదువు తప్పని సరి అని తెలిపాడు.
విద్య , నైపుణ్యాలు లేకపోవడం: ఒక వ్యక్తి విజయంలో విద్య, నైపుణ్యాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చాణక్యుడు నమ్మాడు. సరైన జ్ఞానం లేదా నైపుణ్యాలు లేకుండా వ్యక్తులు మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు లేదా అభివృద్ధి కోసం అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే కష్టపడాల్సి ఉంటుంది. పేదరికంలో చిక్కుకుని ఉంటారు.
అత్యాశ కలిగిన స్త్రీలు ఇంటికి పమాదకరం అని.. ఆ ఇంటిలో సుఖ సంతోషాలు ఉండవని పేర్కొన్నాడు చాణక్యుడు. అత్యాశ గల స్త్రీ కుటుంబం పురోగతిని అడ్డుకుంటుంది.
ఒకరిపై ఆధారపడి జీవించే స్త్రీ.. ఇంటిని కాపాడుకోలేదని పేర్కొన్నాడు చాణక్య. ఇతరులపై ఆధారపడి జీవించే మహిళలో ఆత్మవిశ్వాసం ఉండదు. స్వతంత్ర నిర్ణయాలను తీసుకోలేరు.
శత్రువు దాడి: శత్రువు ఎవరికైనా ఇబ్బంది కరమే అని.. అతను ఎప్పుడైనా మీ పై దాడి చేయవచ్చు అని చెప్పాడు ఆచార్య చాణక్యుడు. అలా హఠాత్తుగా శత్రుడు మీ పై దాడి చేస్తే.. ఎదుర్కోవడానికి మీ వద్ద ఎటువంటి వ్యూహం ఉండదు. కనుక అటువంటి శత్రువుపై ప్రతీకారం తీర్చుకోకండి.. వెంటనే ఆ స్థలాన్ని విడిచి పెట్టమని సూచించాడు చాణక్య.