
అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వాస్తు ప్రకారం ఇంటిలో జామ చెట్టు ఉండటం మంచిదేనా? ఉంటే ఏ దిశలో ఉండాలి. అసలు దీని గురించి వాస్తు శాస్త్ర నిపుణులు ఏమంటున్నారు? అనే విషయాలగురించి మనం వివరంగా తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం ఇంటిలో జామ చెట్టు ఉండటం మంచిదేనంట. కానీ అది సరైన దిశలో ఉన్నప్పుడే ఎలాంటి వాస్తు సమస్యలు తలెత్తవు అని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఇంటిలో సానుకూల శక్తి పెరగాలి అంటే తప్పకుండా వాస్తు ప్రకారం ఇంటి లోపల జామ చెట్టును తూర్పు లేదా ఈశాన్య దిశలో నాటాలంట. దీని వలన ప్రతికూల శక్తి తగ్గిపోతుంది. సానుకూల శక్తి పెరుగుతుంది.

ఎవరి ఇంటిలో అయితే జామ చెట్టు తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంటుందో, వారి ఇంటిలో ఆనందకర వాతావరణం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందంట. ఇది మీ ఇంటి వాస్తుపై, కుటుంబ సభ్యులపై ఎలాంటి చెడు ప్రభావం చూపదు.

ఎవరి ఇంటిలోనైతే జామ చెట్టును సరైన దిశలో పెంచుతారో, ఆ ఇంటిలో సమృద్ధి, శ్రేయస్సు కలుగుతుందంట. అంతే కాకుండా ఇది ఇంటి లోపల సానుకూల శక్తిని ప్రేరేపిస్తుందని, ఇంటి ఆనందకర వాతావరణాన్ని సృష్టిస్తుందని చెబుతున్నారు పండితులు. అందుకే జామ చెట్టు పెంచుకునే సమయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలంట. లేకపోతే ఇది కూడా కొన్ని సార్లు ఇంటిలోని సమస్యలకు కారణం అవుతుంది

ముఖ్యంగా జామ చెట్టు ఎప్పుడు కూడా ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా లేదా ఇంటి గోడకు దగ్గరగా ఉండకూడదంట. ముఖ్యంగా ఇంటికి నైరుతి దిశలో అస్సలే జామ చెట్టు నాటకూడదంట. దీని వలన ఇంటిలో ఆందోళనకర పరిస్థితులు, ఆర్థిక సమస్యలు వస్తాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అంతే కాకుండా ఇంటి ముందు ఎండిపోయినా, వాడిపోయిన జామ చెట్టు ఉండటం శుభప్రదం కాదు. ఇది ఇంటికి దురదృష్టాన్ని తీసుకొస్తుందంట. అందుకే ఇంటి వద్ద ఎప్పుడూ పచ్చగా ఉండే చెట్టు మాత్రమే ఉండాలి.