
ఇంటిలో మనీ ప్లాంట్ పెట్టుకోవడం వలన అన్ని విధాల కలిసి వస్తుంది. ఇది ఇంటికి అందాన్ని తీసుకురావడమే కాకుండా, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఇంటిలో సానుకూల శక్తిని ప్రోత్సహిస్తుంది. అందువలన చాలా మంది లివింగ్ రూమ్ లేదా బాల్కనీ, ప్రధాన ద్వారం వద్ద దీనిని పెంచుకుంటారు.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ మొక్క నాటిన తర్వాత అందులో పాలు పోయడం వలన చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయంట. పాలు స్వచ్ఛతకు గుర్తు, అందువలన మనీ ప్లాంట్ మొక్కలో పాలు పోయడం వలన అప్పుల బాధలు పోయి, ఆర్థికంగా కలిసి వస్తుందంట. అంతే కాకుండా లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు.

అలాగే మనీ ప్లాంట్ నాటిన మట్టిలో కొద్దిగా చక్కెర వేయడం కూడ చాలా మంచిదంట. ఇది చెట్టును వేంగా పెరిగేలా చేస్తుంది. అలాగే, అదేవిధంగా ఆర్థిక వృద్ధి సాధిస్తుందంటా. చక్కెర అనేది మాధుర్యం, సామరస్యానికి చిహ్నం కాబట్టి చక్కెర మనీ ప్లాంట్‌లో వేయడం వలన అన్ని విధాలా కలిసి వస్తుంది.

వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్ కి పోసే నీటిలో కొద్దిగా పాలు కలిపితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందని నమ్ముతారు. మనీ ప్లాంట్ కేవలం ఒక అందమైన మొక్క మాత్రమే కాదు, అది ఒక శక్తివంతమైన వాస్తు సాధనం. దానిని సరైన పద్ధతిలో, సరైన దిశలో నాటితేనే మీ ఇంట్లో ఐశ్వర్యం నిలకడగా ఉంటుంది. ఈ మొక్కను ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదని, అలా ఇస్తే మీ ఇంట్లోని ఐశ్వర్యం ఇతరుల పాలు అవుతుందని ఒక నమ్మకం ఉంది.

అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ మొక్కను సరైన దిశలో పెట్టాలి. దీనిని తూర్పు లేదా ఉత్తరం దిశలో పెట్టడం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా తెల్లటి కుండీలో దీనిని పెంచడం వలన సానుకూల శక్తి పెరుగుతుందంట. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు