
వృషభం: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన బుధుడు తన స్వస్థానంలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి మహా భాగ్య యోగం పడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభసూచనలు కూడా ఉన్నాయి. ఉద్యో గంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలలు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. లాభదా యక పరిచయాలు ఏర్పడతాయి. లాభసాటి ఒప్పందాలు కుదురుతాయి. షేర్లు బాగా లాభిస్తాయి.

మిథునం: ఈ రాశి కేంద్రంలో బుధుడి ప్రవేశం వల్ల భద్ర మహా పురుష యోగం ఏర్పడింది. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలకు విపరీతంగా డిమాండ్ పెరిగి, రాబడి ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. సంపద విషయంలోనూ, వృత్తి, ఉద్యోగాలపరం గానూ ప్రముఖుడుగా చెలామణీ అయ్యే అవకాశం ఉంది. అత్యున్నత స్థాయి వ్యక్తులతో పరిచ యాలు పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగి ఊహించని స్థిరత్వం ఏర్పడుతుంది.

కన్య: ఈ రాశివారికి దశమ కేంద్రంలో బుధుడి స్వస్థాన సంచారం వల్ల భద్ర మహా పురుష యోగం ఏర్ప డింది. ఈ యోగం వల్ల ఈ రాశివారు ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఒక సంపన్న వ్యక్తిగా గుర్తింపు పొందడం జరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఒక ప్రముఖుడి స్థాయికి ఎదుగుతారు.

తుల: ఈ రాశికి భాగ్యస్థానంలో బుధ సంచారం వల్ల మహా భాగ్య యోగం, లక్ష్మీ కటాక్ష యోగం ఏర్ప డ్డాయి. వీటి వల్ల ఎలాంటి ఆర్థిక ప్రయత్నం చేపట్టినా విజయవంతమవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిం చడంతో పాటు అంచనాలకు మించిన జీతభత్యాలు పొందే అవకాశం కూడా ఉంది. పేరు, ప్రఖ్యా తులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి.

ధనుస్సు: ఈ రాశికి సప్తమ కేంద్రంలో బుధుడి స్వస్థాన సంచారం వల్ల భద్ర మహా పురుష యోగం కలిగింది. దీనివల్ల కలలో కూడా ఊహించని రాజయోగం పడుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయం అవుతుంది. సంపన్న వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. జీవనశైలి సమూలంగా మారిపోతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలతో పాటు, ఎలాంటి ఆర్థిక సమస్య యినా పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. షేర్లు బాగా లాభిస్తాయి.

మీనం: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో బుధ సంచారం వల్ల భద్ర మహా పురుష యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా, స్థాయి ఊహించని స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. అనుకోకుండా గృహ, వాహన యోగాలు పట్టే సూచనలున్నాయి. ఆస్తి పాస్తులు బాగా కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తుల విలువ బాగా పెరు గుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.