
బాబా వంగా అంచనాలు ఎల్లప్పుడూ వార్తల్లో ఉంటాయి. ఆమె అంచనాలు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. బాబా వంగా 2025 గురించి యుద్ధం, రాజకీయ తిరుగుబాట్లు, ప్రకృతి వైపరీత్యాలతో సహా అనేక ఆశ్చర్యకరమైన అంచనాలను కూడా చేశారు. అంతేకాదు బాబా వంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక శ్రేయస్సును ముందుగానే ఊహించారని నమ్ముతారు. ఇప్పుడు 2025 చివరి మూడు నెలలకు సంబంధించి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో బాబా వంగా ప్రకారం.. ఈ 90 రోజులు కొన్ని రాశులకు చాలా శుభప్రదం. ఈ నాలుగు రాశుల వారు ఈ 3 నెలల్లో అన్ని వైపుల నుంచి ఆనందం, విజయం, పురోగతిని పొందుతారు. సంవత్సరం చివరి నెలల్లో ప్రయోజనం పొందే నాలుగు అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి: బాబా వంగా ప్రకారం 2025 చివరి మూడు నెలలు వృషభ రాశిలో జన్మించిన వారికి చాలా శుభప్రదంగా ఉంటాయి. ఈ కాలంలో సూర్యుడు ఈ రాశికి చెందిన వారిపై ప్రత్యేక ఆశీర్వాదాలను ప్రసాదిస్తాడు. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అవకాశాలను పొందుతారు. వేగంగా అభివృద్ధి చెందుతారు. కృషికి తగిన ఫలితాలను పాడుతారు. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబ జీవితంలో శాంతి, ఆనందం రాజ్యమేలుతాయి. ఈ మూడు నెలల్లో పెండింగ్‌లో ఉన్న పని పూర్తవుతుంది. అదృష్టం వీరి సొంతం. మొత్తంమీద.. ఈ మూడు నెలలు వృషభ రాశి వారికి విజయం , ఆనందంతో నిండి ఉంటుంది.

మిథున రాశి: బాబా వంగా అంచనాల ప్రకారం 2025 చివరి మూడు నెలలు మిథున రాశి వారికి చాలా శుభప్రదమైనవి. ఈ సమయంలో వీరు బృహస్పతి ఆశీస్సులతో ప్రకాశిస్తారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కెరీర్‌లో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు ఆర్థిక లాభాలను పొందుతారు. కుటుంబంలో శాంతి, సంతోష వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితం, సామరస్యపూర్వకంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మనస్సు సంతోషంగా ఉంటుంది. మొత్తంమీద ఈ సమయం మిథున రాశి వారికి ఆనందం, విజయంతో నిండి ఉంటుంది.

కన్యా రాశి: బాబా వంగా అంచనాల ప్రకారం 2025 చివరి మూడు నెలలు ఈ రాశి వారికి అదృష్టంతో నిండి ఉంటాయి. శనిదేవుని ఆశీస్సులతో ఈ కాలంలో అదృష్టం ప్రకాశిస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కొత్త సంపద వనరులు వస్తాయి. వృత్తి, వ్యాపారంలో పురోగతిని పొందుతారు. ఈ సమయంలో కొత్త ఆస్తి, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రియమైనవారి నుంచి మద్దతు లభిస్తుంది. జీవితంలోని ప్రతి అంశంలో విజయం వీరిని వరిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు.

కుంభ రాశి: బాబా వంగా ప్రకారం 2025 చివరి మూడు నెలలు కుంభ రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొత్త కెరీర్ మైలురాళ్ళను అందుకుంటారు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నవారికి గణనీయమైన లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. కుటుంబంలో శాంతి,యు ఆనందం రాజ్యమేలుతుంది. జీవిత భాగస్వామితో వీరి సంబంధం మరింత మధురంగా సాగుతుంది. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వారు సంపద, గౌరవం, విజయాన్ని పొందుతారు. మొత్తంమీద అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ మూడు నెలల కాలం కుంభ రాశి వారికి ఆనందం, పురోగతితో నిండి ఉంటుంది.