వారెవ్వా.. ఏం రుచి గురూ.. చికెన్ ఫ్రై ఇలా చేస్తే కారంగా అదిరిపోద్దీ

Updated on: Oct 08, 2026 | 6:32 PM

చికెన్ ఫ్రై అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే ఎప్పుడూ చేసుకునే విధంగా కాక, కాస్త రుచిగా, కారంగా, డిఫరెంట్‌గా ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ఇలా వండాలి. కాగా ఇప్పుడు మనం రుచికరమైన చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు :   చికెన్ 1 కేజీ,   కారం 1 టీస్పూన్,  ఉప్పు రుచికి సరిపడా,  పసుపు చిటెకెడు,   నూనె 1 టేబుల్ స్పూన్,  జీలకర్ర ద్దిగా,   ఉల్లిపాయలు,  అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు,   పచ్చిమిర్చి 2, చీల్చినవి,   కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగినవి,   పుదీనా: 2 టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగినవి,  కరివేపాకు రెండు లేదా మూడు రెమ్మలు.  మసాలా పొడి కోసం,  దాల్చిన చెక్క,   లవంగాలు,   యాలకులు,  అనాస పువ్వు, బిర్యానీ ఆకు,   మిరియాలు, ధనియాలు, జీలకర్ర,  ఎండు కొబ్బరి,  ఎండుమిర్చి

2 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే.. కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో కొంచెం ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి, అందులో  అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసి వేయించాలి.

3 / 5
 తర్వాత సన్నగా తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు బాగా వేయించాలి.  ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి.మ్యారినేట్ చేసిన చికెన్‌ను కడాయిలో వేసి అంతా బాగా కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, మూత పెట్టి చికెన్ నీరు వదిలి, చక్కగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.

4 / 5
 చికెన్ ఉడికే లోపు, మసాలా తయారు చేసుకోవాలి. దీని కోసం  దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, చిన్న బిర్యానీ ఆకు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మసాలా పొడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు  చికెన్ దాదాపు ఉడికి, ఇంకా కొద్దిగా నీరు ఉన్నప్పుడు, చీల్చిన పచ్చి మిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా చేర్చి బాగా కలపాలి.

5 / 5
 ఇప్పుడు మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి, చికెన్‌లోని నీరంతా కరిగిపోయి,  చికెన్ ముక్కలు కొద్దిగా రంగు మారిన తర్వాత, ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడి మొత్తం, రెండు, మూడు రెమ్మల కరివేపాకు వేయాలి. కరివేపాకును చివర్లో వేయడం వల్ల దాని సువాసన చికెన్‌కు బాగా పట్టి అద్భుతమైన రుచిని ఇస్తుంది. సాలా, కరివేపాకు వేసిన తర్వాత, మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చికెన్ మాడిపోకుండా మంచి రంగు వచ్చేవరకు సుమారు 10 నిమిషాల పాటు బాగా రోస్ట్ చేసుకోవాలి.  మధ్యలో కలుపుతూ ఉండాలి. చివరగా కొత్తిమీర వేయాలి. అంతే చికెన్ ఫ్రై రెడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us