
జొన్న ఇడ్లీలు ఇలా చేసి తింటే రుచి అదుర్స్. ఎందుకంటే, దీనిలో శరీరానికి కావాల్సిన పీచుపదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకా దీనిలో ఐరన్, మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

ఈ ఇడ్లీలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, బరువు తగ్గేందుకు కూడా ఇది సహాయపడుతుంది. అందుకే, చాలా మంది ఇప్పటికి బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటారు. ఈ ఇడ్లీలు తయారు చేసేటప్పుడు దీనిలో కొద్దిగా మినపప్పు వేస్తె మెత్తగా, దూదిలా వస్తాయి, తినడానికి కూడా రుచిగా ఉంటాయి. ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

జొన్న ఇడ్లీ తయారు చేసే విధానం కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు జొన్న పిండి, అర కప్పు మినపప్పు, పావు కప్పు అటుకులు, రుచికి సరిపడా ఉప్పు, మూడు గ్లాస్ ల నీళ్లను పోయాలి. అయితే, వీటిని ముందుగా నానాబెట్టుకుని మెత్తగా రుబ్బుకోవాలి. దీనిని మర్చిపోకండి జొన్న రవ్వను మూడు గంటల ముందే నానాబెట్టుకోవాలి.

మిక్సీ లేదా రోటిలో రుబ్బిన మినపప్పు పిండిలో ముందుగా నానబెట్టిన జొన్న రవ్వ, రుచికి సరిపడా ఉప్పు వేసి 8 గంటలు వేసి దీనిని బాగా పులియబెట్టాలి. అలాగే, ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని ఆ ప్లేట్స్ కు చేతితో నూనె రాసి 15 నిముషాల పాటు ఆవిరిపై వీటిని బాగా ఉడికించాలి.

పల్లీల చట్నీతో తింటే అదిరిపోతోంది : ఇడ్లీలు ఉడికిన తర్వాత కిందకు దించి, ఒక ప్లేట్ లోకి తీసుకుని పల్లీల చట్నీతో తింటే నాన్ వెజ్ కూరలు కూడా మర్చిపోతారు. అంత రుచిగా ఉంటాయి. ఇంకా ఫాస్ట్ గా అవ్వాలంటే జొన్న రవ్వకు బదులు పిండి తీసుకుంటే త్వరగా అవుతాయి.