
చాలా మంది రాగి ఇడ్లీ, అంతే కాకుండా కొన్ని రకాల చిరు ధాన్యాలు కలిపి సజ్జలు, కొర్రలు, జొన్నల వంటి వాటిని కలిపి చిరుధాన్యాలతో ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అయితే దీంతో ఇడ్లా ప్రిపేర్ చేసుకునే సమయంలో అవి మెత్తగా రావు. కానీ ఇడ్లీలు చాలా మెత్తగా దూదిలా రావాలి అంటే, ముందుగా వాటిని తీసుకునే సమయంలో సరైన మోతాదులో తీసుకోవాలి. అప్పుడే ఇడ్లీలు మెత్తగా వస్తాయి.

అంతే కాకుండా చాలా మంది నానబెట్టే విషయంలో కూడా తప్పులు చేస్తుంటారు. కానీ వీటిని సరైన విధంగా నానబెట్టడం వలన రుబ్బే సమయంలో మెత్తగా గ్రైండ్ అయ్యి, ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. త్వరగా ఉడికిపోతాయి. ఇలా మెత్తగా ఉండే ఇడ్లీలను ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. అంతే కాకుండా వీటి రుచి కూడా బాగుంటుంది.

ఏ ఇడ్లీ అయినా సరే సరిగ్గా రావాలి అంటే ముందుగా, సరిగ్గా పులియాలి. ఇక మిల్లెట్ ఇడ్లీ చేస్తే పిండి బాగా పులియబెట్టాలి. అప్పుడే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. మీరు పిండిని మెత్తగా రుబ్బిన తర్వాత వాటిని దాదాపు 8 గంటల వరకు పులియబెట్టడం అవసరం. అప్పుడే అవి మెత్తగా వస్తాయి. అంతే కాకుండా రుచి కూడా బాగుంటుంది.

కేవలం నాన బెట్టడం, గ్రైండ్ చేయడం, ఉడికించడం మాత్రమే కాదండోయ్, స్ట్రీమింగ్ కూడా సరైన విధంగా జరగాలి. మీరు మిల్లెట్స్ తో చేసే ఇడ్లీలు సరిగ్గా కలిపి, మంచిగా పులియ బెట్టిన తర్వాత అవి మెత్తగా ఉడికేలా చూడాలి. దీని కోసం గ్యాస్ పై కుక్కర్ పెట్టి, అందులో నీరు పోసి, అవి వేడి అయ్యి పొగలు వస్తు్న్న సమయంలో ఇడ్లీ ప్లేట్స్ పెట్టి మూత పెట్టాలి.

ఇలా చేయడం వలన ఇడ్లీలు చాలా త్వరగా, మెత్తగా ఉడికిపోతాయి. అంతే కాకుండా ఇడ్లీలను హై ఫ్లేమ్‌లో పెట్టి ఎక్కువ సేపు ఉడికించకుండా, లో ఫ్లేమ్‌లో పెట్టి దాదాపు 10 నుంచి 15 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికితే మిల్లేట్స్ ఇడ్లీలు మెత్తగా దూదుల్లా వస్తాయి. ఇక ఇలా ప్రతి రోజూ మిల్లెట్ ఇడ్లీ తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అనేక రకాల సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.