
రాత్రివేళల్లో ఆక్సిజన్ విడుదల: సాధారణంగా చాలా మొక్కలు పగటిపూటే ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. కానీ స్నేక్ ప్లాంట్ రాత్రి సమయంలో కూడా కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. అందువల్ల దీనిని బెడ్‌రూమ్‌లో ఉంచుకోవడం చాలా మంచిది.

ప్రస్తుత ఆధునిక కాలంలో ఇండోర్ ప్లాంట్స్ పెంచడం ఒక ట్రెండ్‌గా మారింది. అయితే కేవలం ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, మన ఆరోగ్యానికి, వాస్తు సమతుల్యతకు ఎంతో మేలు చేసే మొక్కల్లో స్నేక్ ప్లాంట్ మొదటి వరుసలో ఉంటుంది. ఆరోగ్యాన్ని, అందాన్ని, వాఅనుకూలతను అందించే ఈ స్నేక్ ప్లాంట్‌ను ఎలా పెంచితే మంచిది!

నాసా పరిశోధనల ప్రకారం, స్నేక్ ప్లాంట్ గాలిలోని ఫార్మాల్డిహైడ్, గ్జైలీన్, టోలుయిన్ వంటి ప్రమాదకరమైన విషపూరిత రసాయనాలను పీల్చుకుని గాలిని సహజ సిద్ధంగా శుద్ధి చేస్తుంది. ఈ మొక్క గాలిలో తేమను పెంచి, దుమ్ము, అలర్జీ కారకాలను తగ్గిస్తుంది. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు, ఉబ్బసం ఉన్నవారికి ఎంతో ఉపశమనం లభిస్తుంది.

వాస్తు శాస్త్ర ప్రయోజనాలు: వాస్తు శాస్త్రం ప్రకారం స్నేక్ ప్లాంట్ ఇంట్లోని ప్రతికూల శక్తిని పీల్చుకుని, సానుకూల వాతావరణాన్ని నింపుతుంది. ఈ మొక్కను ఇంటి తూర్పు, ఆగ్నేయం లేదా దక్షిణ దిశలలో ఉంచడం అత్యంత శ్రేయస్కరం. ఇది కుటుంబ సభ్యుల మధ్య మానసిక ప్రశాంతతను, ఆర్థిక సమృద్ధిని ప్రోత్సహిస్తుంది.

పనిలో ఏకాగ్రత: ఆఫీసు డెస్క్ లేదా స్టడీ టేబుల్ మీద ఈ మొక్కను ఉంచడం వల్ల ఒత్తిడి తగ్గి, దృష్టి, కాగ్రత పెరుగుతాయి. ఈ మొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఎక్కువ సూర్యకాంతి లేదా నీరు అవసరం లేదు. వారానికి ఒకసారి నీరు పోసినా ఇది ఏపుగా పెరుగుతుంది. కాబట్టి తక్కువ సమయం కేటాయించగలిగే వారికి కూడా ఇది సరైన ఎంపిక.