
పొట్లకాయ, పచ్చిశనగపప్పు కూరను ఇలా ఇలా ఈజీగా మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది అన్నం, చపాతీ, రోటిల్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళి ఇదే తింటారు. దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

పొట్లకాయ, పచ్చిశనగపప్పు తయారీ విధానం : ముందుగా పప్పు బాగా ఉడికించుకోవాలి. నానబెట్టిన పచ్చిశనగపప్పును తీసుకుని దీనిలో సరిపడా నీళ్లు, ఇంకా దీనిలో కొద్దిగా పసుపు కూడా వేసి మరి మెత్తగా కాకుండా ఒక మాదిరిగా దీనిని మంచిగా ఉడికించి పక్కన పెట్టుకోండి.

పొట్లకాయ, పచ్చిశనగపప్పు తయారీ విధానం స్టెప్ 1 : ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి అది బాగా వేడయ్యాక దానిలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించండి. అవి వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేపండి.

పొట్లకాయ, పచ్చిశనగపప్పు తయారీ విధానం స్టెప్ 2 : కూర వండుకోవాలి. ఇక ఇప్పుడు టమాటా ముక్కలు దీనిలో వేసి ఇవి బాగా మెత్తబడే వరకు వీటిని మంచిగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత దీనిలో నాలుగు పొట్లకాయ ముక్కలు, ఇంకా కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి బాగా కలపండి.

పొట్లకాయ, పచ్చిశనగపప్పు తయారీ విధానం స్టెప్ 3 : పప్పును కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి పొట్లకాయ ముక్కలను వేసి సన్నని మంటపై ఇది మెత్తబడే వరకు దీనిని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు బాగా ఉడికిన తర్వాత దీనిలో పచ్చిశనగపప్పు వేసి మరో 4 నిమిషాలు సిమ్‌లో ఉంచి దించేయాలి. చివరగా కొత్తిమీర చల్లి దింపేయండి