రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఆర్గానిక్ ఎరువు.. వాసనలేని కిచెన్ కంపోస్ట్

Updated on: Oct 03, 2026 | 5:16 PM

మిద్దెతోటలు లేదా బాల్కనీ గార్డెన్‌లలో మొక్కలు పెంచే ప్రతి ఒక్కరికీ మొక్కలకు బలాన్నిచ్చే వర్మీ కంపోస్ట్ లేదా సేంద్రియ ఎరువులు కొనుగోలు చేయడం ఆర్థికంగా భారమవుతుంది. అయితే మన వంటింట్లో ప్రతిరోజూ వెలువడే కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలు, వాష్ చేసిన టీ పొడి వంటి వ్యర్థాలను చెత్తబుట్టలో పారేయకుండా రూపాయి ఖర్చు లేకుండా అమృతం లాంటి "బ్లాక్ గోల్డ్" కిచెన్ కంపోస్ట్‌గా మార్చుకోవచ్చు. చాలామంది కంపోస్ట్ చేయడానికి వెనకడుగు వేయడానికి కారణం చెడు వాసన రావడం, పురుగులు పట్టడం. 

1 / 5
ఒక పాత ప్లాస్టిక్ బకెట్ లేదా పెయింట్ డబ్బాను తీసుకుని అడుగున, సైడ్స్‌లో గాలి ఆడేందుకు మరియు ద్రవం బయటకు పోయేందుకు వీలైనన్ని ఎక్కువ రంధ్రాలు చేయాలి. బకెట్ అడుగున ఒక ట్రేను ఉంచాలి. కంపోస్ట్ ప్రాసెస్‌లో వచ్చే లిక్విడ్ ఫ్లోర్‌పై పడితే బ్యాడ్ స్మెల్ వస్తుంది.

2 / 5
ట్రేలో చేరిన ఈ ద్రవాన్ని నీటిలో డైల్యూట్ చేసి మొక్కలకు లిక్విడ్ ఫర్టిలైజర్‌గా ఇస్తే అద్భుతమైన పోషకాలు అందుతాయి. బకెట్ అడుగు రంధ్రాలు మూసుకుపోకుండా ఉండేందుకు రాళ్లు, పెంకులు లేదా 1-2 ఇంచుల మందం మట్టిని వేసి కవర్ చేయాలి.

3 / 5
ఏ రోజు వచ్చిన కూరగాయల తొక్కలను ఆ రోజే వేయవచ్చు. గుడ్డు పెంకులు ఉంటే బాగా నలిపి పొడి చేసి వేయాలి. ఒక లేయర్ కిచెన్ వేస్ట్ వేసిన ప్రతిసారీ దానిపైన తప్పనిసరిగా సమానంగా పొడి మట్టి లేదా ఎండుటాకులు, కొబ్బరి పీచులను కప్పాలి. తడి శాతం ఎంత ఉంటుందో పొడి శాతం కూడా అంతే ఉండాలి. అప్పుడే తేమ సమతుల్యమై వాసన రాదు. ఉడికించిన అన్నం, నూనె పదార్థాలు, కూరల మిగులును అస్సలు వేయకూడదు ఇవి వేస్తేనే పురుగులు, తీవ్రమైన దుర్వాసన వస్తాయి .

4 / 5
బకెట్ నిండిన తర్వాత పైభాగంలో 2-3 ఇంచుల మందంతో మట్టిని కప్పి ఎయిర్‌టైట్ కాకుండా సాధారణ మూత పెట్టాలి. ఇప్పుడు బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెంది వ్యర్థాలు కుళ్ళడానికి పులిసిన మజ్జిగను లేదా బియ్యం కడిగిన నీటిలో కొద్దిగా బెల్లం కలిపిన నీళ్లను వారానికి ఒకసారి పైనుంచి చల్లుతూ ఉండాలి.

5 / 5
మొదటి 15 రోజులు బకెట్‌ను ఏమాత్రం కదిలించకూడదు. 15 రోజుల తర్వాత వారం వారం ఒక కర్రతో పైకి కిందకి తిప్పుతూ ఉంటే గాలి ఆడి కంపోస్ట్ త్వరగా మగ్గుతుంది. దాదాపు 2 నెలల్లో వ్యర్థాలన్నీ కుళ్లిపోయి నల్లటి ఎరువుగా మారుతాయి. ఈ తయారైన కంపోస్ట్‌ను ఎండలో కాకుండా గాలి తగిలే నీడ ప్రదేశంలో 3 రోజుల పాటు పలుచగా ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిన తర్వాత జాలి గిన్నెతో జల్లెడ పట్టుకుంటే అచ్చం నల్లటి టీ పొడిలాంటి వాసన లేని పర్ఫెక్ట్ కిచెన్ కంపోస్ట్ సిద్ధమవుతుంది! పూల, పండ్ల మొక్కల మొదట్లో వారానికి గుప్పెడు వేస్తే చెట్టు నిండా భారీగా పూలు, కాయలు కాస్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us