యాపిల్ ఐఫోన్ 14 ప్లస్‌లోని 6.7 అంగుళాల స్క్రీన్, 12 ఎంపీ ప్రధాన కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాలు ఆకట్టుకుంటున్నాయి. దీనిలోని డ్యూయల్ కెమెరా సిస్టమ్‌తో పోర్ట్రెయిట్ మోడ్, ఫోకస్, డెప్త్ కంట్రోల్‌తో ఫోటోలను తీసుకునే అవకాశం ఉంది. దీనిలోని లిథియం - అయాన్ బ్యాటరీ 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఫోన్ సులభంగా రీఛార్జ్ చేయడానికి మాగ్ సేఫ్, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా అందిస్తుంది. ఏ15 బయోనిక్ చిప్ కలిగిన ఫోన్ లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ చేసుకోవచ్చు. భద్రతకు సంబంధించి ఫేస్ ఐడీ, బేరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్లు ఉన్నాయి. ఈ ఆపిల్ ఐఫోన్ రూ. 57,499కు అందుబాటులో ఉంది.