Sleeping Tips: రాత్రిళ్లు నిద్ర పట్టడంలేదా? అయితే మీ బెడ్‌ షీట్స్‌ వెంటనే మార్చేయండి..

Updated on: Jan 29, 2025 | 12:45 PM

నేటి జీవలశైలి కారణంగా చాలా మందికి పడుకోగానే రాత్రిళ్లు నిద్రసరిగ్గా రాదు. దీంతో అటు ఇటు దొర్లి చివరకు ఫోన్ పట్టుకుని తెల్లారేంత వరకు రీల్స్ చూస్తూ ఉంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఈ విధమైన అలవాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. నిజానికి నిద్ర పట్టకపోవడానికి గల అనేకానేక కారణాల్లో బెడ్ షీట్స్ కూడా ఒకటి అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

1 / 5
మనం సాధారణంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు అలారం ఆపివేసి నిద్రపోతాం. తరువాత, మేల్కొన్నప్పుడు దాని గురించి చింతిస్తాం. మీకూ ఈ అలవాటు ఉంటే, పడుకునేటప్పుడు  అలారం అందకుండా బెడ్‌కు కొన్ని అడుగుల దూరంలో దీనిని ఉంచండి. దీంతో అలారం మోగిన వెంటనే దానిని ఆఫ్‌ చేయకుండా ఉంటారు. ఎందుకంటే దాన్ని ఆపివేయడానికి మీరు లేవాలి. కొంత దూరం నడవాలి. ఇలా చేయడం వల్ల గాఢ నిద్ర మత్తు వదిలిపోయి, మేల్కొనడానికి సహాయపడుతుంది.

2 / 5
ముందుగా బెడ్‌పై ఉపయోగించే షీట్‌లు అన్నీ కాటన్‌వి మాత్రమే ఉండాలని గుర్తుంచుకోండి. లేత రంగులను మాత్రమే ఎంచుకోవాలి. తెలుపు,దా లేత పసుపు రంగు బెడ్‌ షీట్లను ఉపయోగించవచ్చు. ఏ రోజు కారోజు సాయంత్రం బెడ్ షీట్లను మార్చితే తాజా అనుభూతిని ఇస్తుంది. తద్వారా త్వరగా నిద్రపోతారని నిపుణులు అంటున్నారు.

3 / 5
పడుకునే ముందు దిండు, బెడ్‌ షీట్లపై కొద్దిగా పెర్ఫ్యూమ్ ఉపయోగించినా ఫలితం ఉంటుంది. ఇది మంచి నిద్రను కలిగిస్తుంది. వేసవిలో ముదురు రంగు బెడ్ షీట్లను ఉపయోగించడం మంచిది కాదు. ఫలితంగా వేడిగా అనిపించవచ్చు. ఏసీ ఆన్‌లో ఉంటే, లైట్ షీట్లు వినియోగించాలి.

4 / 5
ఎక్కువ డిజైన్లు ఉన్న ఏ షీట్‌ను ఉపయోగించవద్దు. బదులుగా ఎలాంటి ప్రింట్ లేకుండా ప్లెయిన్‌గా ఉన్న షీట్‌లను ఎంచుకోవాలి. ఇవి మనస్సు ప్రశాంతంగా ఉంచుతాయి. బాగా నిద్రపోతారు. అందుకే ఎల్లప్పుడూ తెలుపు రంగు బెడ్‌ షీట్లను ఎంచుకోవాలి.

5 / 5
నిద్రవేళకు ఆరు గంటల ముందు కెఫిన్ తీసుకోవడం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా, పడుకునే ముందు మద్యం సేవించడం కూడా మంచిదికాదు. ఉదయం మగతను తగ్గించడానికి ఈ రెండు అలవాట్లు మానుకోవాలి. మధ్యాహ్నం వేళలో కెఫిన్ తీసుకోవడం పరిమితం చేయాలి. ఇది నిద్ర నాణ్యత మెరుగుపరుస్తుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనంలో తేలింది. ఇది సోమరితనాన్ని కూడా తగ్గించగలదు. అలాగే రాత్రి పడుకునే ముందు మొబైల్ వాడకాన్ని తగ్గించాలి.