
సర్జరీ చేయించుకున్నారా?: నేరేడు పండుకు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను చాలా వేగంగా తగ్గించే శక్తి ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది వరమే అయినా, సర్జరీకి సిద్ధమవుతున్న వారికి లేదా సర్జరీ పూర్తి చేసుకున్న వారికి ఇది శాపంగా మారవచ్చు. ఆపరేషన్ సమయంలో మరియు ఆ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం. నేరేడు పండు తింటే చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పడిపోయి, రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అందుకే సర్జరీకి కనీసం రెండు వారాల ముందు నుంచి వీటికి దూరంగా ఉండాలి.

గర్భధారణ సమయంలో ఆచితూచి: గర్భిణీ స్త్రీలు నేరేడు పండ్లను తినే విషయంలో వైద్యుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నేరేడు పండులో ఉండే ఆక్సిలేట్లు కాల్షియం గ్రహించకుండా అడ్డుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం నేరేడు పండ్లు శరీరంలో వేడిని కలిగిస్తాయి. గర్భధారణ సమయంలో అధిక వేడి శిశువుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి, గర్భిణీలు రోజుకు 2-3 పండ్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు, అది కూడా డాక్టర్ సలహా మేరకే.

ఖాళీ కడుపుతో తింటే గ్యాస్ట్రిక్ టామ్: నేరేడు పండు రుచికి పులుపు, వగరుగా ఉండటానికి కారణం అందులోని ఆమ్ల గుణాలు. ఉదయాన్నే ఏమీ తినకుండా నేరేడు పండ్లు తీసుకుంటే కడుపులో తీవ్రమైన మంట, అజీర్ణం కలుగుతాయి. నేరేడు పండ్లు తిన్న వెంటనే పొరపాటున కూడా పాలు తాగకూడదు. పాలు, నేరేడు పండులోని రసాయనాలు కలిస్తే అది విషతుల్యంగా మారి వాంతులు, విరేచనాలకు దారితీస్తుంది.

శ్వాసకోస సమస్యలు: మీరు తరచూ జలుబు, దగ్గు లేదా ఆస్తమాతో బాధపడుతున్నారా? అయితే నేరేడు పండుకు దూరంగా ఉండండి. నేరేడు పండుకు శరీరాన్ని అతిగా చల్లబరిచే గుణం ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల ఆస్తమా రోగులకు ఊపిరి అందక ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా నేరేడు పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి కిడ్నీలు సరిగ్గా పనిచేయని వారు వీటిని తింటే, ఆ పొటాషియం రక్తంలో పేరుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

నేరేడు పండును సురక్షితంగా ఎలా తినాలి?: నేరేడు పండ్లను కొద్దిగా ఉప్పు లేదా వాము పొడితో కలిపి తింటే వాయు సమస్యలు రావు. భోజనం చేసిన గంట తర్వాత వీటిని తినడం ఉత్తమమైన పద్ధతి. మధుమేహ వ్యాధిగ్రస్తులు పండు కంటే, దీని గింజలను ఎండబెట్టి చేసిన పొడిని వాడటం వల్ల షుగర్ లెవల్స్ అద్భుతంగా నియంత్రణలో ఉంటాయి. "అతి సర్వత్ర వర్జయేత్" అన్నట్లుగా.. నేరేడు పండు ఎంత మేలు చేసినా, పరిమితి దాటితే ప్రమాదకరమే.