1 / 5
Viral: సముద్రగర్భంలో లెక్కలేనన్ని జలచరాలు నివస్తున్నాయి. వీటిలో సమాజానికి తెలిసినవి కొన్ని మాత్రమే. తెలియని, వింత జాతులు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో తాజాగా ఒక వింత చేప వెలుగు చూసింది. దానిని ఒక్కసారిగా చూస్తే ‘ఏలియన్’ అనిపించక మానదు. సముద్రానికి 600 నుంచి 800 మీటర్ల లోతులో ఈ వింత చేపను చూసి అమెరికా శాస్త్రవేత్తలు సైతం ఉలిక్కిపడ్డారు. ఈ వింత చేప తల విచిత్రంగా క్రిస్టల్ మాదిరిగా ఉండి.. దాని కళ్లు పూర్తి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. లోతైన సముద్రంలో నివసించే ఈ జీవిని ‘బారెల్లీ ఫిష్’ , స్పూకీ ఫిష్ అని కూడా పిలుస్తారు. 83 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తలు తొలిసారిగా ఈ చేపను చూశారు.