మొక్కలు అనుకున్నంత ప్రశాంతంగా ఉండవు. తాజా పరిశోధనలో మొక్కల గురించి చాలా విషయాలు వెల్లడయ్యాయి. మొక్కలు కూడా ఒత్తిడికి గురవుతాయని పేర్కొన్నారు. తమని కరిచినప్పుడు శబ్దం చేస్తాయి, ఏడుస్తాయి. మొక్కలు చాలా నిశ్శబ్దంగా ఉంటాయని ఇప్పటి వరకు నమ్మేవారు.. అయితే ఇటీవలి పరిశోధనలో కొన్ని మొక్కలు నీటిలో ఉన్నప్పుడు శబ్దం చేస్తాయని తేలింది. ఇవి ప్రత్యేక సంకేతాలను విడుదల చేస్తాయి. అవి ఎలా గుర్తిస్తారో తెలుసుకోండి.
డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. ఒత్తిడి సమయంలో సంకేతాలను విడుదల చేసే కొన్ని మొక్కలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది. ఇది వాయిస్‌గా గుర్తించారు. టొమాటో, మొక్కజొన్న, పొగాకు వంటి అనేక రకాల మొక్కల్లో అల్ట్రాసోనిక్ వైబ్రేషన్‌లు సెన్సార్ల ద్వారా మొక్కల వాయిస్ ను రికార్డ్ చేశారు. ఎలుకలు వంటి జంతువులు మొక్కల నుండి వచ్చే శబ్దాలను 5 మీటర్ల దూరం నుండి కూడా వినగలవని మొదటిసారిగా నిర్ధారించారు.
మొక్కల పౌనఃపున్యం ఎక్కువగా ఉండటం వల్ల మనుషులు వాటి శబ్దాన్ని వినలేరని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే పరిశోధన సమయంలో మొక్కల శబ్దం వినడానికి ఫ్రీక్వెన్సీని తగ్గించారు. ఇలా చేశాక మొక్కల నుంచి వచ్చే శబ్దం పాప్ కార్న్ వండేటప్పుడు వచ్చే సౌండ్ లానే ఉందని గుర్తించారు. గాలి బుడగలు మొక్కల కాండం వద్దకు చేరుకోవడం.. అవి పగిలినప్పుడు ఈ శబ్దం రావడం గుర్తించారు. ఇలా మొక్కల్లో ప్రతి గంటకు ఒకసారి జరుగుతుంది.
పరిశోధన చేసిన టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు లిలాచ్ హడేన్ మాట్లాడుతూ.. తాము పరిశోధనలో భాగంగా వంద కంటే ఎక్కువ మొక్కలను అధ్యయనం చేసామని చెప్పారు. ఈ సందర్భంగా మొక్కలకు కూడా సొంత స్వరం ఉందన్న విషయం వెలుగులోకి వచ్చింది. మొక్కల దగ్గర ఉండే గబ్బిలాలు, ఎలుకలు, కీటకాలు, చిమ్మటలు మొక్కల మాటను అర్థం చేసుకుంటాయి. ఇవి తమ హై ఫ్రీక్వెన్సీ వాయిస్‌ని వినగలుగుతాయి. సెన్సార్ల సహాయంతో మొక్కలకు ఎప్పుడు నీరు అవసరమో అర్థం చేసుకోవడానికి పరిశోధన ఫలితాలు సహాయపడతాయని తాము భావిస్తున్నామని చెప్పారు.
మొక్కలకు కూడా జీవం ఉంటుందని భారతీయ శాస్త్రవేత్త ఆచార్య జగదీశ్ చంద్ర బోస్ నిరూపించారు. క్రెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని అభివృద్ధి చేసి.. మొక్కల్లో ఉన్న వివిధ తరంగాలను కొలవడానికి ఉపయోగించారు. దీని సహాయంతో చెట్లు, మొక్కలలో ప్రాణం ఉందని నిరూపించాడు. రాయల్ సొసైటీలో తన ప్రయోగాన్ని చేశాడు. జగదీశ్ చంద్ర బోస్ చేసిన ఆవిష్కరణ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడింది.