భూమిపై మిలియన్ల రకాల జాతుల జీవులు నివసిస్తున్నాయి. వాటిలో ఒకటి తాబేలు కూడా. భూమిపై ఎక్కువ కాలం జీవించే జీవి తాబేలు. అవి 200 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. ఇక మానవుడు 125 నుంచి 130 సంవత్సరాలు జీవితకాలం ఉంటుంది. అయితే అతి చిన్న జీవులు ఏంటో తెలుసా? మనం రోజూ చూసే జీవులు ఈ లిస్ట్‌లో చాలా ఉన్నాయి. వీటి జీవిత కాలం ఒక రోజు మాత్రమే ఉంటుంది. ఇలాంటి కొన్ని జీవులకు సంబంధించి ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతిరోజూ మనం ఎలుకలను చూస్తూనే ఉంటాం. కానీ అవి ఎంతకాలం జీవిస్తాయో తెలుసా? ఒక నివేదిక ప్రకారం.. ఎలుకల సగటు వయస్సు 1 నుంచి 2 సంవత్సరాలు మాత్రమే. అయితే కొన్ని ఎలుకలు 5 సంవత్సరాల వరకూ జీవిస్తాయి. 5 సంవత్సరాలు జీవించడానికి సరైన సంరక్షణ అవసరం ఉంటుంది.
తూనిగ (డ్రాగన్ ఫ్లైస్)లను చూసే ఉంటారు. అనేక రంగులలో కనిపించే ఈ తూనిగలు తరచుగా సాయంత్రం వేళల్లో కనిపిస్తాయి. ఇవి 4 నెలలు మించి జీవించవు. వీటిలోనే 3 నెలల కన్నా తక్కువ జీవించేవి కూడా ఉన్నాయి.
మనం రోజూ చూసే జీవుల్లో ఈగలు ఒకటి. ఇల్లంతా రచ్చ చేస్తాయి. ఇంట్లో వండుకునే ఆహారంపై వాలి అనేక రోగాలకు కారణం అవుతుంది. ముఖ్యంగా తీపి వస్తువులపై వాలుతాయి. వీటి జీవిత కాలం గరిష్టంగా 4 వారాలు మాత్రమే.
దోమలను రోజంతా ఎదుర్కొంటాం. వీటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాత్రిపూట చుక్కలు చూపిస్తాయి. ఇవి చాలా ప్రమాదకరం. ప్రాణాంతకం కూడా. వీటి జీవితకాలం 24 గంటలు మాత్రమే.