ISRO: ఇస్రోలో ఉద్యోగం సంపాదించడం ఎలా? ఇవిగో మార్గాలు..

| Edited By: Srilakshmi C

Jul 13, 2023 | 10:54 AM

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఉండే క్రేజే వేరు. అందులోనూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో ఉద్యోగం సాధించాలని దేశ యువత ఉవ్విళ్లూరుతుంది. అయితే ఇస్రోలో ఉద్యోగం సంపాదించాలి అంటే ఎలా ? మొదట ఏడాదికి మూడు సాయిలు ఇస్రో మెయిన్ సెంటర్ నుంచి ఆన్లైన్ లో ఇస్రో వెబ్సైట్ ద్వారా జాబ్ వేకెన్సీస్ గురించి వివరాలు..

1 / 5
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఉండే క్రేజే వేరు. అందులోనూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో ఉద్యోగం సాధించాలని దేశ యువత ఉవ్విళ్లూరుతుంది. అయితే ఇస్రోలో ఉద్యోగం సంపాదించాలి అంటే ఎలా ? మొదట ఏడాదికి మూడు సాయిలు ఇస్రో మెయిన్ సెంటర్ నుంచి ఆన్లైన్ లో ఇస్రో  వెబ్సైట్ ద్వారా జాబ్ వేకెన్సీస్ గురించి వివరాలు ప్రకటన వస్తుంది.. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్‌ను  పూర్తి చేసి  ఏ క్వాలిఫికేషన్ కు ఏ తరహా ఉద్యోగాలు కావాలో ఆ తరహా అప్లికేషన్ నందు మనము ఫిల్ చేయాలి.

2 / 5
ఇస్రో నిర్వహించే ప్రవేశ పరీక్షలు నందు మొదట హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆన్లైన్  ప్రవేశ పరీక్షలో క్వాలిఫై అయినవారు  నేరుగా ఇంటర్వ్యూకు ఇస్రో కేటాయించిన తేదీల్లో అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇస్రోలో వివిధ విభాగాలకు సంబంధించి ఉద్యోగాలు ఉంటాయి .అందులో ఐటిఐ, డిప్లమా, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, డాక్టరేట్ కోర్స్ చదివిన వారికి ఇస్రోలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మొట్ట మొదట 20,000 రూపాయలు నుండి 2 లక్షల రూపాయల వరకు జీతం ఉంటుంది.. ఇస్రోకి దేశ వ్యాప్తంగా అనేక విభాగాలు ఉన్నాయి.. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి అంతరిక్ష ప్రయోగాలు జరుగుతుంటాయి.. ఇది అందరికీ తెలుసు..

3 / 5
కానీ ఆ ప్రయోగాలు జరిగిన అనంతరం ఉపగ్రహాలు మానిటరింగ్ మొత్తం బెంగళూరు ఇస్రో సెంటర్ నుంచి జరుగుతాయి.. అలాగే కేరళలోని త్రివేండ్రం లో ఉపగ్రహాలు తయారీ జరుగుతుంటాయి.. తమిళనాడు లోని తిరునల్వేలి జిల్లా మహేంద్ర గిరి నుంచి ఇస్రో సొంత పరిజ్ఞానం తో తయారు చేసిన రాకెట్ ఇంజన్ల పరీక్షలు జరుగుతుంటాయి.. ఇక చెన్నై సహా ఢిల్లీలో కూడా ఇస్రో అనుబంధంగా అనేక విభాగాలు పని చేస్తుంటాయి.

4 / 5
ఇస్రో లో జాబ్ సంపాదిస్తే స్థాయిని బట్టి క్వార్టర్స్, వాహన సదుపాయం, కార్పొరేట్ తరహా ఆస్పత్రులు, ఇక కీలక ప్రయోగాల సందర్భంలో ప్రత్యేక సదుపాయాలు కూడా ఉంటాయి..

5 / 5
ఇలా ఎప్పటికప్పుడు ఇస్రో వైబ్సైట్ ను గమనిస్తుంటే ఇస్రోలో ఉద్యోగం చేసే అవకాశం దక్కుతుంది. ఇస్రోలో  ఉద్యోగం సంపాదించేందుకు యువత ఎంతో ఆసక్తి కరంగా ఎదురు చూస్తూ ఉంటారు.. అయితే ఎలా అనేది తెలియక చాలామంది అవకాశాలను పొందలేక పోతుంటారు.. ఇటీవల కాలంలో ఐటి ఉద్యోగాల్లో ఉన్న వారు కూడా ఆరంగంలో ఉద్యోగ భద్రత లేని కారణంగా ఇస్రో వైపు మొగ్గు చూపుతున్నట్లు తాజా రిక్రూట్మెంట్ చెబుతోంది.. సో ఇంకెందుకు ఆలస్యం ఇస్రో వెబ్సైట్ వైపు ఎప్పటికప్పుడు ఓ లుక్ వేస్తే మీకు ఆ లక్కు తగలొచ్చు.