ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సమంగ్ భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. సామ్‌సంగ్ క్రిస్టల్ 4కే నియో టీవీ పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ టీవీ ఫీచర్లపై ఓ లుక్కేయండి.
ఈ స్మార్ట్ టీవీలో 3,840x2,160 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉండే 43 ఇంచుల 4కే అల్ట్రా హెచ్‌డీ స్క్రీన్‌ను ఇచ్చారు. టైజన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే ఈ టీవీలో 1.5 ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు.
ఇందులో 20 వాట్ల సౌండ్ అవుట్‌పుట్ స్పీకర్లను ఇచ్చారు. డాల్బీ డిజిటల్ ప్లస్‌కు ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్ అడాప్టివ్ ఫీచర్ ఈ టీవీ ప్ర్యతేకత. గూగుల్ అసిస్టెంట్, అలెక్సాకు సపోర్ట్ చేస్తుంది.
ఈ టీవీలో వైఫై, బ్లూటూత్, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, ఓ యూఎస్‌బీ పోర్ట్ కనెక్టివిటీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్‌ను ఇచ్చారు. బ్లూటూత్‌తో పాటు ఇన్‌ఫ్రారెడ్‌కు సపోర్ట్ చేసే రిమోట్‌ను ఈ స్మార్ట్ ఫోన్‌తో అందిస్తారు.
ఇక ధర విషయానికొస్తే ఈ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర రూ. 35,990గా ఉంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌తో పాటు సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ టీవీ అందుబాటులో ఉంది.