కేవలం ₹3 ఖర్చుతో.. మొక్కలకు వచ్చే బూజు తెగులు, పురుగులు మాయం!

Updated on: Nov 17, 2026 | 5:43 PM

మనం ఎంతో ఇష్టంతో టెర్రస్ గార్డెన్‌లో లేదా పెరట్లో పెంచుకునే కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలకు వాతావరణ మార్పుల సమయంలో రకరకాల తెగుళ్లు సోకుతుంటాయి. ముఖ్యంగా వర్షాకాలం ముగిసి చలికాలం మొదలయ్యే సమయంలో మంచు ప్రభావం వల్ల ఆకులపై తెల్లటి బూజు తెగులు, ఇతర ఫంగస్ వ్యాధులు ఎక్కువగా వస్తాయి. దీనికి తోడు చిన్న చిన్న ఈగలు, దోమలు మొక్కలను నాశనం చేస్తుంటాయి. వీటి నివారణకు మార్కెట్లో దొరికే ఖరీదైన మందులు కొనాలంటే సామాన్యులకు భారంగా మారుతుంది. అయితే కేవలం మూడు రూపాయల ఖర్చుతో ఇంట్లోనే ఒక అద్భుతమైన ఆర్గానిక్ పెస్టిసైడ్ మరియు ఫంగిసైడ్ తయారు చేసుకోవచ్చు.

1 / 5
ఈ సహజ సిద్ధమైన మందు తయారీకి మనకు కావాల్సింది స్వచ్ఛమైన కర్పూరం మరియు వేప నూనె. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి; మార్కెట్లో కర్పూరం అనగానే కొన్నిసార్లు నాఫ్తలీన్ బాల్స్ ఇస్తుంటారు. మొక్కలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నాఫ్తలీన్ బాల్స్ వాడకూడదు. కేవలం పూజకు ఉపయోగించే స్వచ్ఛమైన ముద్ద కర్పూరం లేదా చిన్న కర్పూరం బిల్లలను మాత్రమే తీసుకోవాలి.

2 / 5
కర్పూరంలో అద్భుతమైన యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. దీని ఘాటైన వాసనకు ఈగలు, దోమలు, రసం పీల్చే పురుగులు మొక్కల దరిచేరకుండా పారిపోతాయి. దీని తయారీ కొలతలు చాలా సులభం. ఒక లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కర్పూరం తీసుకోవాలి.

3 / 5
ఉదాహరణకు మీ తోటకు 20 లీటర్ల నీరు అవసరమైతే 20 గ్రాముల కర్పూరం బిల్లలను తీసుకోవాలి. కర్పూరం చల్లటి నీళ్లలో త్వరగా కరగదు కాబట్టి, ఒక చిన్న మగ్గులో కర్పూరం వేసి అందులో వేడి నీళ్లు పోసి ఉదయం నుంచి సాయంత్రం వరకు నానబెట్టాలి. బిల్లలు చిన్నవిగా ఉంటే త్వరగా కరిగిపోతాయి.

4 / 5
కర్పూరం పూర్తిగా నీటిలో కరిగిన తర్వాత, అందులో లీటరు నీటికి ఒక మిల్లీలీటరు చొప్పున (20 లీటర్లకు 20 మి.లీ.) వేప నూనె కలపాలి. ఇందులో షాంపూ వంటి ఇతర రసాయనాలు ఏవీ కలపాల్సిన అవసరం లేదు. ఈ రెండింటినీ నురుగు వచ్చేలా బాగా గిలక్కొట్టి, ఆ మిశ్రమాన్ని 20 లీటర్ల సాధారణ నీటిలో కలపాలి.

5 / 5
ఈ ద్రావణాన్ని 10 లేదా 15 రోజులకు ఒకసారి మొక్కల ఆకులన్నీ తడిచేలా పిచికారీ చేయాలి. తెగులు సోకిన తర్వాతే కాకుండా, చలికాలం ప్రారంభంలోనే ముందుజాగ్రత్తగా దీనిని స్ప్రే చేస్తే బూజు తెగులు అసలు దరిచేరదు. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ సహజ ఎరువును అన్ని రకాల కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలకు నిరభ్యంతరంగా వాడి మంచి దిగుబడిని పొందవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us