
పండుగ వస్తే చాలు ప్రతి ఇంట్లో ఈ అప్పాలు ఉంటాయి. పల్లెటూర్లలో ఈ రెసిపీ చాలా ఫేమస్. ఇవి ఆరోగ్యానికి కూడా బలం. వీటిని తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఈ రుచి సూపర్ ఉంటుంది. అయితే, దీనిని ఎక్కువగా పండుగలు, ప్రత్యేక సమయాల్లో బాగా చేసుకుంటారు. ఇది చేసి మీ పిల్లలకు పెడితే పెద్దల వరకు ఇష్టంగా తింటారు

బియ్యం పిండి అప్పాలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు : నాలుగు కప్పుల బియ్యపు పిండి , ఒక కప్పున్నర బెల్లం తురుము, నాలుగు గ్లాస్ లు నీరు, ఒక టీ స్పూన్ యాలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, నాలుగు టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి, ఈ అప్పాలను కాల్చుకోవడానికి ఎంత సరిపోతే అంత ఆయిల్ ను తీసుకోవాలి.

బియ్యం పిండి అప్పాల తయారి విధానం : ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో నీళ్ళు పోసి ఒక కప్పున్నర బెల్లం తురుమును వేసి హై మంటపై ఉంచి గరిటెతో కలుపుతూ దీనిని ఉండాలి. ఇది మొత్తం పాకం లాగా అయ్యే వరకు తిప్పుతూనే ఉండాలి. కొద్దీ సేపటి తరవాత ఈ మిశ్రమాన్ని తీసుకుని దీనిని వడకట్టి 10 నిముషాలు ఉంచుకోవాలి. ఇలా చేస్తే బెల్లం మంచిగా అవుతుంది

బియ్యం పిండి అప్పాల తయారి విధానం స్టెప్ 1 : ఈ పాకాన్ని తీసుకుని దానిలో కొద్దీ కొద్దిగా బియ్యపు పిండిని వేస్తూ ఒక పెద్ద గరిటెతో కలుపుకోవాలి. ఇది ముద్ద ,ముద్దలుగా లేకుండా బియ్యపు పిండి దీనిలో కలిసిపోయేలా దీనితో పాటు కొబ్బరి పొడిని కూడా వేసి తిప్పుకోవాలి. ముద్దలుగా ఉంటే పప్పలు సరిగా రావు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

బియ్యం పిండి అప్పాల తయారి విధానం స్టెప్ 2 : చేతికి ఆయిల్ రాసుకుని చిన్న లడ్డులు మాదిరి చేసుకోవాలి. ఆ తరువాత వీటిని రూపాయి కవర్ పై వీటిని వేసి పప్పాలాగా చేసి పలుచగా ఒత్తాలి వీటిని ఆయిల్ వేసి మీడియం మంట మీద కాల్చుకోవాలి. ఒక వైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకోవాలి. బాగా కాలిన తరవాత తీసుకుని ఒక పేపర్ మీద ఆరబెట్టి గిన్నెలో నిల్వ చేసుకోవాలి.