
ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి ఇలాంటి భయకరమైన వేడిని తగ్గించి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి, ఒంటికి చలువ చేసే ఈ పుచ్చకాయ సబ్జా జ్యూస్ ప్రతి ఒక్కరూ తాగాల్సిందే. దీనినే కొందరు పల్లెటూరిలో పొలం పండు డ్రింక్ అని కూడా పిలుస్తారు. అయితే, వీటిని కేవలం 15 నిమిషాల్లోనే చేసుకుని తాగొచ్చు. ఒక పుచ్చకాయ ఉంటే ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకుని కూల్ కూల్ గా తాగొచ్చు.

పుచ్చకాయ సబ్జా జ్యూస్ కు కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్స్ నానబెట్టిన సబ్జా గింజలు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, 10 పుదీనా ఆకులు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా ఒక టేబుల్ స్పూన్ తేనె లేదా పంచదారను తీసుకోవాలి, ఒక కప్పు ఐస్ ముక్కలు కూడా తీసుకోవాలి. దీనిని కూల్ కూల్ గా తాగితే ఆ మజానే వేరు. మీరు కూడా ట్రై చేయండి.

పుచ్చకాయ సబ్జా జ్యూస్ తయారీ విధానం : ముందుగా ఒక గిన్నెలో సబ్జా గింజలు తీసుకుని వాటిని నీటిలో బాగానానబెట్టుకోవాలి. ఇంకా దీనిలో సరిపడా నీళ్లు పోసి కనీసం 30 నిమిషాల పాటు నానాబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద పుచ్చకాయను తీసుకుని దానిని బాగా కడిగి ముక్కలుగా చేసుకుని ఒక ప్లేట్ లేదా గిన్నెలో పెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు, 10 కడిగిన పుదీనా ఆకులు, తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఇంకా కొద్దిగా పంచదార కూడా వేసి వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని దానిలో నానబెట్టుకున్న సబ్జా గింజలు, కట్ చేసిన పుచ్చకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకున్న ఈ జ్యూస్ ను వడపోసి, ఆలాగే దీనిలో ఐస్ క్యూబ్స్ కూడా వేసి కలుపుకుని తాగడమే.

ఈ జ్యూస్ తాగడం వలన ప్రయోజనాలు ఇవే.. ఇది శరీర వేడిని ఈజీగా తగ్గిస్తుంది. ఇంకా వేసవిలో వచ్చే వడదెబ్బ నుంచి కూడా ఇది కాపాడుతుంది.ఇంకా డీహైడ్రేషన్ సమస్యకు ను కూడా ఇది నివారిస్తుంది. ఎందుకంటే, పుచ్చ పండులో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇంకా ఎక్కువగా దీనిని తినడం వలన ఉండటం వల్ల బాడీని కూల్ గా ఉంచుతుంది. జీర్ణక్రియను కూడా ఇది మెరుగుపరుస్తుంది. సబ్జా గింజలు కడుపు మంటకు చెక్ పెట్టి జీర్ణక్రియ పనితీరుకు ఇది సహాయపడుతుంది.