పచ్చి ఉల్లిపాయలు తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్త పడాల్సిందే!

Updated on: Apr 04, 2026 | 8:04 AM

భారతీయ భోజనంలో పచ్చి ఉల్లిపాయలు లేకుండా ముద్ద దిగదు. వీటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నప్పటికీ, కొన్నిసార్లు ఇవే మన ఆరోగ్యానికి శత్రువుగా మారవచ్చు. పచ్చి ఉల్లిపాయల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్, ఎవరు వీటిని తినకూడదో తప్పక తెలుసుకోవాలి. లేదంటే, ప్రమాదం పడతారు. పచ్చి ఉల్లిపాయలు (Raw Onions) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నవారు వీటిని తినడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరెవరు పచ్చి ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి..? దీనివల్ల కలిగే నష్టాలేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
జీర్ణ సమస్యలు (Digestive Issues): పచ్చి ఉల్లిపాయల్లో ఫైబర్, ఫ్రక్టోన్ అధికంగా ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణం కావు. ఫలితంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఐబీఎస్ (IBS) సమస్య ఉన్నవారు వీటికి దూరంగా ఉండటం మంచిది.

2 / 5
తెల్ల ఉల్లిపాయ ముక్కల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే మూత్రంలో మంట తగ్గడంతోపాటు మూత్రపిండాలూ ఆరోగ్యంగా ఉంటాయి. కలరా వ్యాధితో బాధపడే రోగికి ఉల్లిరసాన్ని తరచూ పట్టిస్తే మంచిదట. పచ్చి ఉల్లిపాయని తింటే నెలసరి సమస్యలూ తగ్గుతాయి.

3 / 5
మీ ఆహారంలో ఉల్లిపాయలు ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లి రక్తపోటును అదుపులోనూ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఉల్లిపాయలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఉల్లిలో ఉండే విటమిన్ సి మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉల్లిపాయలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. కానీ ఉల్లిన ఎల్లప్పుడు ఆహారంలో మితంగానే తీసుకోవాలి.

4 / 5
గుండెల్లో మంట (Heartburn): పచ్చి ఉల్లిపాయలు తిన్నప్పుడు కడుపులో యాసిడ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఛాతీలో మంట లేదా గొంతులో మంటగా అనిపించవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట పచ్చి ఉల్లిపాయలు తినడం మానుకోవాలి.

5 / 5
సర్జరీకి ముందు: ఉల్లిపాయలు రక్తం గడ్డకట్టే ప్రక్రియను నెమ్మదిస్తాయి. కాబట్టి ఏదైనా శస్త్రచికిత్స (Surgery) జరగడానికి రెండు వారాల ముందే పచ్చి ఉల్లిపాయలను తినడం ఆపేయాలని వైద్యులు సూచిస్తారు. ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. పచ్చి ఉల్లిపాయలు పడటం లేదనిపిస్తే, వాటిని కొంచెం నూనెలో వేయించి లేదా ఉడికించి తీసుకోవడం వల్ల పైన పేర్కొన్న సమస్యలను చాలా వరకు తగ్గించుకోవచ్చు.

Follow Us