తెల్ల కొంగల మధ్య మెరిసే నల్ల కొంగలు.. ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!

Edited By:

Updated on: Nov 16, 2026 | 11:48 AM

ప్రకృతి ఒడిలో విహరించే పక్షుల జీవనశైలి ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. సాధారణంగా కొంగలు అనగానే మన కళ్లముందు మెదిలేది స్వచ్ఛమైన తెలుపు రంగు మాత్రమే. కానీ, ప్రకృతి వైవిధ్యంలో భాగంగా నలుపు రంగులో మెరిసిపోయే అరుదైన కొంగలు కూడా ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదు.

1 / 5
 ప్రకృతి ఒడిలో విహరించే పక్షుల జీవనశైలి ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. సాధారణంగా కొంగలు అనగానే మన కళ్లముందు మెదిలేది స్వచ్ఛమైన తెలుపు రంగు మాత్రమే. కానీ, ప్రకృతి వైవిధ్యంలో భాగంగా నలుపు రంగులో మెరిసిపోయే అరుదైన కొంగలు కూడా ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదు. ప్రస్తుతంఏలూరు జిల్లాలోని పచ్చని పంట పొలాల్లో ఇలాంటి ఒక అపురూప దృశ్యం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

2 / 5
ఏలూరు  జిల్లా లోని పెదపాడు , దెందులూరు , కొల్లేరు పరివాహక పరిధిలోని వట్లూరు , మలికిపురం , చాటపర్రు , దెందులూరు  గ్రామ శివారు పొలాల్లో తెల్ల కొంగలతో పాటు నల్ల కొంగలు కూడా గుంపులుగా చేరి ఆహారాన్ని అన్వేషిస్తున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. దూరం నుంచి చూసేవారికి అచ్చం కాకుల గుంపులా కనిపించే ఈ పక్షులను దగ్గరగా పరిశీలిస్తే వాటి అసలు అందం బయటపడుతుంది. వీటి రెక్కలు ముదురు ఆకుపచ్చ, ఊదా రంగుల సమ్మేళనంతో సూర్యకాంతికి మెరిసిపోతూ చూపరులను కట్టిపడేస్తున్నాయి. వీటిని స్థానికంగా  పక్షి శాస్త్ర పరిభాషలో 'మెరుపు కంకణాల పిట్ట' లేదా 'నల్ల కంకణాల పక్షి' అని పిలుస్తారు.

3 / 5
సాధారణంగా పక్షుల్లో జాతులు, రంగులు వేరుగా ఉన్నప్పుడు వేర్వేరుగా సంచరిస్తుంటాయి. కానీ, ఈ పక్షులు మాత్రం రూపురేఖల్లో, రంగుల్లో పూర్తి వైవిధ్యం ఉన్నప్పటికీ, ఆహార వేట విషయానికి వచ్చేసరికి ఎలాంటి భేదభావాలు లేకుండా తెల్ల కొంగలతో కలిసిమెలిసి ఒకే చోట చేరడం విశేషం. పంట పొలాల్లోని నీటి నిల్వల్లో ఉండే చిన్నపాటి కీటకాలు, పురుగులను ఆహారంగా తీసుకుంటూ ఈ పక్షులు రైతులకు పరోక్షంగా మేలు చేస్తాయి. వరి పొలాలు, బురద నేలల్లో సంచరించే ఈ నల్ల కంకణాల పక్షులు పంటలకు నష్టం కలిగించే మిడతలు, గొంగళి పురుగులు, నత్తలు, కీటకాల లార్వాలను ప్రధాన ఆహారంగా తీసుకుంటాయి

4 / 5

దీనివల్ల పంటలపై రసాయన పురుగుమందుల వాడకం తగ్గి, రైతులకు పెట్టుబడి భారం కూడా కొంతవరకు తగ్గుతుంది. అందుకే పర్యావరణవేత్తలు వీటిని రైతుల నిజమైన నేస్తాలుగా అభివర్ణిస్తారు. నలుపు, తెలుపు రంగుల కలబోతతో పచ్చని పొలాల మధ్య ఈ పక్షులు సాగిస్తున్న ఆహార వేట ప్రకృతిలోని సహజీవనానికి, జీవవైవిధ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

5 / 5
శాస్త్రీయంగా 'ప్లెగాడిస్ ఫాల్సినెల్లస్' అని పిలిచే ఈ పక్షుల ముక్కు పొడవుగా, కొద్దిగా కిందికి వంగి ఉంటుంది. బురద నీటిలో లోతుగా ఉండే పురుగులను, చిన్నపాటి జలచరాలను సులభంగా పట్టుకోవడానికి ఈ ప్రత్యేక ఆకృతి వీటికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇవి ప్రపంచవ్యాప్తంగా పలు ఖండాల్లో కనిపించే వలస పక్షులు. శీతాకాలం ప్రారంభం కాగానే, అనుకూలమైన వాతావరణం, సమృద్ధిగా ఆహారం లభించే చిత్తడి నేలలను వెతుక్కుంటూ ఇవి సుదూర ప్రాంతాల నుంచి కోస్తా తీర ప్రాంతాలు, ముఖ్యంగా ఉభయ గోదావరి, కాకినాడ జిల్లాల్లోని పంట పొలాలు, చెరువుల వద్దకు చేరుకుంటాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us