రంజాన్‌లో సెహ్రీ సమయంలో (ఉదయం వేళ) ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అవి మిమ్మల్ని చాలా కాలం పాటు ఆకలిని నియంత్రించి కడుపు నిండుగా ఉండే అనుభూతిని కలిగిస్తాయి.
సహరీ సమయంలో ఓట్స్, మల్టీగ్రెయిన్ పరాఠాలను తినవచ్చు. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఇవి సహాయం చేస్తాయి.
సెహ్రీ సమయంలో మితమైన ఆహారం తీసుకోండి. పెద్ద మొత్తంలో తినడం, తాగడం మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
ఈ సమయంలో నీరు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కొబ్బరి నీరు, పండ్ల రసాలు తీసుకోవడం చాలామంచిది. ఇవి రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచడానికి పని చేస్తాయి.
సెహ్రీ సమయంలో ముఖ్యంగా టీ లేదా కాఫీ తాగడాన్ని నివారించండి. కాఫీ, టీ వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల, నీరు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది.