అరెరే ఎండు ద్రాక్ష వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా? ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం అబ్బా!

Updated on: Sep 03, 2026 | 7:14 PM

ద్రాక్ష పండ్లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న విషయం మనకు తెలిసిందే.. అయితే పచ్చి వాటి కంటే ఎండు ద్రాక్షలో మన శరీరానికి అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయని మీకు తెలుసా? అవును ఎండుద్రాక్షలో ఐరన్ , కాపర్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్త కణాల తయారీకి ఉపయోగపడుతాయి. కాబట్టి వీటిని రోజూ తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
ఎముకల ఆరోగ్యం: ఎండు ద్రాక్షలో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల పటుత్వానికి, శరీర సాధారణ పనితీరును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా వీటిలో ఉండే కాల్షియం ఎముకల నిర్మాణాన్ని బలంగా మార్చి నొప్పులను తగ్గిస్తుంది. ప్రతి రోజు ఇతర పోషకాలతో పాటు ఎండు ద్రాక్షను కూడా మీ ఆహారంలో చేర్చుకుంటే మీ ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయి.

2 / 5
గుండె ఆరోగ్యం:  ఎండుద్రాక్షలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలు, నరాల పనితీరు సజావుగా సాగేలా చేస్తాయి. ఇవే కాదు రోజు  పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఎండుద్రాక్ష ఒక్కటే గుండె జబ్బులను తగ్గించదు. వీటితో పాటు ఇతర ఆహారాలను, ముందులను తీసుకోవడం మంచిది.

3 / 5
మహిళల్లో నెలసరి సమయంలో ఐరన్ వంటి పోషకాలు శరీరానికి చాలా అవసరం. ఆ సమయంలో ఎండుద్రాక్ష తినడం వల్ల వారికి అసరమైన ఐరన్, ఇతర ఖనిజాలు లభిస్తాయి. ఒక వేళ అధిక రక్తస్రావం, నిరంతర అలసట లేదా రక్తహీనత లక్షణాలు కనిపిస్తే కేవలం వీటితోనే సరిపెట్టకండి.. ఆహారంతో పాటు వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.

4 / 5
వెయిట్‌లాస్: అయితే చాలా మంది బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఎక్కవగా తింటారు. కానీ ఎండుద్రాక్షలో సహజసిద్ధమైన తీపి, ఎక్కువ కేలరీలు, చక్కెర శాతం ఉంటాయి. కాబట్టి మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉంటే వీటిని లిమిట్‌లో తీసుకోండి. రోజూ తీసుకునే మొత్తం కేలరీలను దృష్టిలో ఉంచుకుని వీటిని తీసుకోవడం మంచిది.

5 / 5
వీటిలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. వీటిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం కావచ్చు. కాబట్టి అవసరమైన మేర తీసుకుంటేనే మంచిది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. అవసరమైతే వైద్యులను సంప్రదించండి.

Loading...
Unable to load recommendations.
Follow Us