
ఎండలు మండిపోతున్నాయి రోజు రోజుకు విపరీతంగా పెరిపోతోంది ఇక ఇదే సమయంలో చాలా మంది చల్లగా ఉండే ఫుడ్స్ ను ఎంచుకుని చేసుకుంటున్నారు. వాటిలో పాతకాలపు వంట పులసరి రెసిపీ కూడా ఒకటి. దీనిని తింటే కడుపు మొత్తం చల్ల బడుతుంది. మరి, దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

పాతకాలపు వంట పులసరి రెసిపీకి కావలసిన పదార్థాలు: రెండు కప్పుల గుమ్మడికాయ ముక్కలు, చింతపండు రసం, ఒక కప్పు పెరుగు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమాటా , నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ పసుపు – రుచికి తగినంత ఉప్పు, ఒక చిన్న బెల్లం ముక్క , ఐదు వెల్లుల్లి రెబ్బలు , కొద్దిగా కరివేపాకు , కొత్తిమీర కొద్దిగా, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

పులసరి రెసిపీ తయారీ విధానం: ముందుగా చింతపండును తీసుకుని మంచి నీటిలో నానబెట్టి దాని నుంచి పులుసు వేరు చేయాలి. ఆ తరవాత గుమ్మడికాయ ముక్కలను తీసుకుని బాగా కడిగి పెట్టుకోవాలి. ఇలా చేస్తే ముక్కలు బాగా ఉడుకుతాయి. అయితే, వీటిని సరిగ్గా చేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఆ తరవాత గ్రేవీ పెరుగు మిశ్రమం తయారు చేసుకోవాలి.

ఒక చిన్న గిన్నెలో చింతరసం, గుమ్మడికాయ ముక్కలు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, రెండు టమాటాలు , నాలుగు పచ్చిమిర్చి వేసి బాగా మరిగించాలి. దానిలో ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పును కూడా వేసి కలపాలి. అయితే, గుమ్మడికాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు సన్నని మంట పై అలానే ఉడికించాలి.

ఇప్పుడు చిన్న బెల్లం ముక్క, నాలుగు వెల్లుల్లి వేసి 10 నిముషాల పాటు బాగా మరిగించాలి. ఇంకా పాన్‌లో ఆయిల్ వేసి అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి పోపు పెట్టుకోవాలి. ఇది పోపు పెట్టుకున్న తరవాత ఈ పులసరిలో వేసి కలుపుకోవాలి చల్లాలి. దీనిని వేడి వేడి అన్నంలో తింటే కడుపు చల్లబడుతుంది.