Pregnant Women: శీతాకాలంలో గర్భిణీలు ఖచ్చితంగా ఈ ఫుడ్స్ తినాల్సిందే!

Updated on: Dec 10, 2024 | 5:46 PM

ఇతర కాలాల కంటే గర్భిణీలు చలి కాలంలో ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్‌లో ఎక్కువగా అనారోగ్య పాలవుతూ ఉంటారు. ఇందుకు కారణం రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. ఈ ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది..

1 / 5
వింటర్ సీజన్ వచ్చిందంటే గర్భిణీలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో రోగ నిరోధక శక్తి అనేది బాగా తగ్గిపోతుంది. దీని వల్ల గర్భిణీలు బాగా అలిసిపోతారు. అనేక వ్యాధులు కూడా చుట్టుముడతాయి.

2 / 5
గర్భిణీలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు ఖచ్చితంగా తీసుకోవాలి. వాటిల్లో బాదం, వాల్ నట్స్ కూడా ఒకటి. వీటిల్లో విటమిన్ ఇ, మెగ్నీషియంలు మెండుగా లభిస్తాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ అధికంగా తీసుకోవాలి.

3 / 5
గర్భిణీలు ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే పాలకూర కూడా తీసుకుంటూ ఉండాలి. ఇతర కూరల కంటే పాలకూర తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఐరన్ శాతం, ఫోలెట్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. రక్త కణాల నిర్మాణంలో ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది.

4 / 5
ప్రెగ్నెంట్ లేడీస్ సాధారణంగానే చేపలు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అందులోనూ చలి కాలంలో తీసుకుంటే మరింత మంచిది. చేపలు తినడం వల్ల శిశువు బ్రెయిన్ అనేది బాగా డెవలప్ అవుతుంది. అంతే కాకుండా శిశువు బ్రెయిన్ యాక్టీవ్‌గా పని చేస్తుంది. సాల్మన్, ట్యూనా వంటి చేపలు తింటే బెటర్.

5 / 5
చలికాలంలో చిలకడ దుంపలు కూడా అధికంగానే లభిస్తాయి. కాబట్టి వీటిని కూడా తింటూ ఉండాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. ఎక్కువ శాతం ఫోలెడ్, ఫైబర్ ఉంటాయి. ఇవి గర్భిణీలు ఖచ్చితంగా తీసుకోవాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

చలికాలంలో చిలకడ దుంపలు కూడా అధికంగానే లభిస్తాయి. కాబట్టి వీటిని కూడా తింటూ ఉండాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. ఎక్కువ శాతం ఫోలెడ్, ఫైబర్ ఉంటాయి. ఇవి గర్భిణీలు ఖచ్చితంగా తీసుకోవాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)